Viral Video: ఫ్లయిట్‌లో లవ్ ప్రపోజ్ చేసిన అమ్మాయి.. ఎంకరేజ్ చేసిన పాసింజర్స్
ఇందులో రెడ్ కలర్ టీ షర్టు వేసుకున్న ఓ వ్యక్తి ఫ్లయిట్ ఎక్కుతూ ఉంటాడు. ఆ తర్వాత ఫ్లయిట్‌లో ఓ స్పెషల్ ఎనౌన్స్‌మెంట్ ఇస్తుంది. రెడ్ కలర్ షర్ట్ ఉన్న అబ్బాయి దగ్గరకు వచ్చి.. నిల్చుంటుంది అమ్మాయి. అదంతా చూసి ఆ అబ్బాయి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి ఏ మాత్రం సిగ్గు పడకుండా అందరి ముందూ ప్రపోజ్ చేస్తుంది. దీంతో అతను కూడా అమ్మాయి లవ్‌ని ఒప్పుకుంటాడు. ఫ్లయిట్‌లో ఉన్నవాళ్లు అందరూ..

లవ్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీద అయినా కలుగుతుంది. ఈ ప్రేమ విషయంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనం ప్రేమించే వ్యక్తి కరెక్టో కాదో తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకుని ప్రేమించాలా? అది ప్రేమ ఎలా అవుతుంది? అని కొందరు అంటే.. ఇప్పుడున్న కాలంలో ఏమీ తెలుసుకోకుండా గుడ్డిగా ప్రేమిస్తే నిజంగానే పప్పులో కాలు వేసినట్లే. మనం ప్రేమించే వ్యక్తి కోసం ఆ మాత్రం తెలుసుకోవాలి కదా.. ఎందుకంటే ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తేనే ఉంటున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే విడిపోతున్నారు. కలకాలం కలిసి ఉండాలంటే ఆ మాత్రం తెలుసుకోవాల్సిందే. తాజాగా ఇలాంటి లవ్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఓ అమ్మాయికి ఫ్లయిట్‌లో తన బాయ్ ఫ్రెండ్‌కి వినూతనంగా లవ్ ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ అమ్మాయి ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. ఇందులో రెడ్ కలర్ టీ షర్టు వేసుకున్న ఓ వ్యక్తి ఫ్లయిట్ ఎక్కుతూ ఉంటాడు. ఆ తర్వాత ఫ్లయిట్‌లో ఓ స్పెషల్ ఎనౌన్స్‌మెంట్ ఇస్తుంది. రెడ్ కలర్ షర్ట్ ఉన్న అబ్బాయి దగ్గరకు వచ్చి.. నిల్చుంటుంది అమ్మాయి. అదంతా చూసి ఆ అబ్బాయి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి ఏ మాత్రం సిగ్గు పడకుండా అందరి ముందూ ప్రపోజ్ చేస్తుంది. దీంతో అతను కూడా అమ్మాయి లవ్‌ని ఒప్పుకుంటాడు. ఫ్లయిట్‌లో ఉన్నవాళ్లు అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఆ తర్వాత అబ్బాయి, అమ్మాయికి కలిపి ఫ్లయిట్ వాళ్లు ఓ సర్ ప్రైజ్ ఇస్తారు. లవ్ ఇన్ ద ఎయిర్ అంటూ ఆ అమ్మాయి క్యాప్షన్ ఇస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోపై కామెంట్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘వావ్ సూపర్ క్యూట్’.. ‘నిజంగానే ఈ వీడియో నిజమేనా’.. ‘మీరిద్దరూ నిజంగానే ముందు ఎంగేజ్ అయి ఆ తర్వాత ఇలా చేస్తున్నారు’.. ‘ఇదంతా ఫేక్ వ్యూస్ కోసం చేస్తున్నారు’.. ‘ఇలా ఎవరూ చేయరు’.. ‘చాలా క్యూట్‌గా ఉన్నారు’.. అంటూ కామెంట్లతో పాటు రకరకాల ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
