
టెక్నాలజీ పెరిగిపోయింది.. సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి బిజినెస్ వ్యవస్థలు.. తమకూడా కలిసొచ్చిందంటున్నారు సామన్యులు. మనిషి ఇంటి నుంచి కదలకుండా సకల వసతులను పొందుతున్నాడు. తనకు కావల్సిన ప్రతి వస్తువును ఆన్‌లైన్ ద్వారా తన వద్దకు రప్పించుకుంటున్నాడు. ఇక ఫుడ్ యాప్‌లు వచ్చాక కొంత మంది వంటలు చేయడమే మానేశారు. ఏది తినాలనిపించినా.. క్షణాల్లో ఆన్‌లైన్ లో ఆర్డర్ పెట్టుకొని ఏం చక్కా తినేస్తున్నారు. ఇదిలావంుటే.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కేసులు ఈ మధ్యకాలంలో తరుచు వార్తల్లో వస్తున్నాయి. అయితే కొంత మంది కన్నింగ్ బుద్ది ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ చిలిపి ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా వెలుగు చూస్తున్నాయి. మొన్నటి మొన్న మహారాష్ట్రలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి.. ముద్దులు పెట్టిన ఘటన ఆలస్యంగా బయటపడిన సంగతి తెలిసిందే.
మరోచోట ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే అందులో పురుగులు కనిపించడం కామన్‌గా మారింది. కస్టమర్ కూడా కంపెనీకి ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత సారీ చెప్పడం ఈ మధ్యకాలంలో మనం చాలా చూసి ఉంటాం. అయితే ఇందుకు భిన్నంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫుడ్‌ను డెలివరీ అయ్యింది. అంతా సాఫీగానే సాగింది. అయితే ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన మహిళ షాక్ అయ్యింది. అందులో వచ్చింది ఫుడ్ కాదు.. నోట్ల కట్టలు. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. నోట్ల కట్టలు చూసిన మహిళ ఆశ్చర్యపోయింది.
చికెన్ శాండ్‌విచ్ ప్యాకెట్ నుంచి డబ్బుల కట్టలు..
వాస్తవానికి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా మీడియా అందించిన కథనాల ప్రకారం, KFC ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి ఒక మహిళ చికెన్ శాండ్‌విచ్‌ను ఆర్డర్ చేసింది. ఆ మహిళ తన ఆహారం వస్తుందని.. తాను తింటానని ఎదురుచూస్తోంది. మహిళ ఆహారం వచ్చింది.. కానీ ఆమె ఆహార ప్యాకెట్ నుంచి నోట్ల కట్టలు కూడా రావడం చూసి షాక్ తిన్నారు. అందులో మొత్తం 43 వేల రూపాయలు వచ్చాయి.
“నోట్ల కట్టులు చూసిన వెంటనే వాటిని తిరిగి కవరులో ఉంచాను. దానిని మూసివేసిన తర్వాత దానిని తిరిగి ఇవ్వడానికి ప్లాన్ చేసాను. దీని తర్వాత, నేను కంపెనీకి కాల్ చేసినప్పుడు, వారి ఉద్యోగులు నా వద్దకు చేరుకున్నారు.”
మేనేజర్ తప్పిదంతో డిపాజిట్ అమౌంట్ ప్యాకెట్‌లోకి..
డబ్బుల కట్టలు చూసిన తర్వాత ఆ మహిళకు ఏం చేయాలో తోచలేదు. చివరికి తన నిజాయితీని ప్రదర్శించింది. నిజాయితీగా కంపెనీని అధికారులకు ఫోన్ చేసింది. ఏం జరిగిందో మొత్తం చెప్పింది. వెంటనే ఆమె ఉంటున్న చోటకు కంపెనీ ఉద్యోగులు పరుగు .. పరుగున వచ్చారు. ఆ ఫుడ్ ప్యాకెట్‌ను కలెక్ట్ చేసుకున్నారు.
ఏం జరిగిందంటే..
ఈ ఘటనలో ఏం జరిగిందంటే.. ఆ రోజు వచ్చిన కలెక్షన్ మొత్తం ఓ బాక్స్‌లో పెట్టి.. పక్కన పెట్టాడు మేనేజర్. అయితే ఆ ప్యాకెట్.. మహిళ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్ ప్యాక్ ఒకేలా ఉండటంతో అందులో పని చేసే వర్కర్ ఓ చిన్న పొరపాటు చేశాడు. అదే ఆర్డర్ ఫుడ్ ప్యాకెట్ అనుకుని డెలివరీ బాయ్‌కు ఇచ్చేశాడు. ఇలా ఆ ప్యాకెట్ ఆ మహిళ వద్దకు చేరింది. మేనేజర్ చేసిన పొరపాటు కారణంగా.. కౌంటర్ నుంచి కొంత డిపాజిట్ మొత్తం కూడా ఆమె ప్యాకెట్‌లోకి పోయింది. తర్వాత కంపెనీ ఈ విషయాన్ని గుర్తించింది.
సదరు మహిళ నిజాయితీపై మేనేజర్ చాలా సంతోషించారు..
ఆ మహిళ నిజాయితీపై కంపెనీ.. దాని ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. మేనేజర్ మహిళకు కృతజ్ఞతలు తెలిపాడు. లేకపోతే తన ఉద్యోగం పోయేదని అన్నాడు. మరోవైపు, తాను చికెన్ శాండ్‌విచ్‌ను ఆర్డర్ చేశానని.. దాని నుంచి డబ్బు వచ్చిందని మహిళ చెప్పింది. అయితేే తనకు వచ్చిన డబ్బులను తన అప్పులు కట్టేందుకు ఉపయోగించుకోవచ్చని.. కానీ తాను అలా చేయలేదని చెప్పుకొచ్చింది ఆ మహిళ.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం