Viral: కవలలకు జన్మనిచ్చిన మహిళ.. కట్ చేస్తే.. డీఎన్ఏ రిపోర్ట్‌తో వెలుగులోకి షాకింగ్ నిజం

కవలలకు జన్మనిచ్చిన మహిళ.. కట్ చేస్తే.. ఆ ఇద్దరు పిల్లలకు తల్లి ఒక్కతే.. తండ్రి మాత్రం వేర్వేరు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Viral: కవలలకు జన్మనిచ్చిన మహిళ.. కట్ చేస్తే.. డీఎన్ఏ రిపోర్ట్‌తో వెలుగులోకి షాకింగ్ నిజం
Trending News

Updated on: Nov 29, 2025 | 12:37 PM

టైటిల్ చూసి ఆశ్చర్యపోవద్దు.. కానీ దీని వెనుక ఉన్న స్టోరీ మాత్రం షాక్‌కు గురి చేస్తుంది. ఈ ఘటన జరిగి మూడేళ్లు కావొస్తోంది. కానీ సోషల్ మీడియా వేదికగా మళ్లీ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..! ఓ 19 ఏళ్ల అమ్మాయి కవలలకు జన్మనిచ్చింది. కానీ డీఎన్ఏ రిపోర్టులో షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే.! ఈ ఇద్దరి పిల్లల తల్లి ఒక్కతే.. తండ్రుల మాత్రం వేర్వేరు అని గుర్తించారు. అసలు స్టోరీలో.. ఆమె ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఆ ఇద్దరితో శారీరిక సంబంధం పెట్టుకుంది.

అందువల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ మహిళ శరీరంలో రెండు ఎగ్స్ ఒకేసారి రిలీజ్ అయ్యాయని.. ఆ రెండు గుడ్లు వేర్వేరు పురుష శుక్రకణాలతో వృద్ది చెందినవిగా పేర్కొన్నారు డాక్టర్లు. ఇలా తండ్రులు వేరుగా.. కవలలు జన్మించినట్టుగా తెలిపారు. వైద్య చరిత్రలో ఇది అరుదైన పరిస్థితి అని.. దీన్ని హెటెరోపెటర్న్ సూపర్‌ఫెకండేషన్ అని పిలుస్తారని తెలిపారు. కాగా ఇది 2022లో బ్రెజిల్‌లోని మైనీరోస్ నగరంలో జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి