Viral Video: నిత్య జీవితంలో అందరు పాముని చూసే ఉంటారు. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రపంచంలో దాదాపు 2000 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నప్పటికీ అందులో100 పాములు మాత్రమే విషపూరితమైనవి. అయితే అందరు వాటిని గుర్తించలేరు. అందుకే ఏ పాముని చూసినా భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. పాములను పట్టుకోవడంలో నైపుణ్యం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. దీనికి చాలా శ్రద్ధ అవసరం ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ జీవితం ముగిసిపోతుంది. ప్రస్తుతం పాముకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక యువతి పాముని పట్టుకుని బ్యాగ్‌లో ఎలా వేసిందో చూడవచ్చు. ఇళ్ల చుట్టు తిరుగుతున్న ఒక పాముని సదరు యువతి గమనించి మొదటగా దాని తోకని పట్టుకుంటుంది. తర్వాత నెమ్మదిగా పామును సంచిలో వేసి ముడి వేస్తుంది. ఆ తర్వాత తీసుకొని వెళ్లిపోతుంది. ఈ వైరల్ వీడియో కేరళలోని తిరువనంతపురంలోని కట్టకడకు చెందినది. పాముని పట్టిన యువతి పేరు రోషిణి. ఆమె అటవీ ఉద్యోగిని. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుధా రామన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. రోషిణి పాములను పట్టుకోవడంలో నిష్ణాతురాలు. దేశవ్యాప్తంగా అటవీ శాఖల్లో మహిళా ఉద్యోగులు పెరుగుతున్నారు. అన్ని పనులలో ఆరితేరుతున్నారు. ఈ 45 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 44 వేల మందికిపైగా వీక్షించారు.1900 మందికి పైగా లైక్ చేశారు. ప్రజలు ఈ వీడియోను చూసిన తర్వాత భిన్నమైన స్పందనలు తెలియజేస్తున్నారు. రోషిణి ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.
A brave Forest staff Roshini rescues a snake from the human habitations at Kattakada. She is trained in handling snakes.
Women force in Forest depts across the country is growing up in good numbers. VC @jishasurya pic.twitter.com/TlH9oI2KrH
— Sudha Ramen ?? (@SudhaRamenIFS) February 3, 2022