AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కిటికీలు తెరిచి మరీ.. భార్యాభర్తల శృంగారం.. విసిగిపోయి పక్కింటావిడ ఏం చేసిందో తెలిస్తే.!

బెంగళూరులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక గిరినగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ.. ఖాకీలకు దిమ్మతిరిగేలా ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చింది. తన ఇంటికి పక్కన ఉంటున్న దంపతులు.. ప్రతీ రోజూ చేసే పాడుపని.. తనను ఇబ్బంది పెడుతోందంటూ.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా.. మరి.!

Viral: కిటికీలు తెరిచి మరీ.. భార్యాభర్తల శృంగారం.. విసిగిపోయి పక్కింటావిడ ఏం చేసిందో తెలిస్తే.!
Benguluru Police
Ravi Kiran
|

Updated on: Mar 26, 2024 | 7:02 PM

Share

బెంగళూరులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక గిరినగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ.. ఖాకీలకు దిమ్మతిరిగేలా ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చింది. తన ఇంటికి పక్కన ఉంటున్న దంపతులు.. ప్రతీ రోజూ చేసే పాడుపని.. తనను ఇబ్బంది పెడుతోందంటూ ఆ 44 ఏళ్ల మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని అవలహళ్లిలో ఉన్న బీడీఏ లేఅవుట్‌లో 44 ఏళ్ల వయసున్న మహిళ తమ కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. సదరు బాధితురాలి ఇంటి తలుపు దగ్గరే.. పక్కింటివారి పడకగది కిటికీ కనిపిస్తుందట. ఇక పక్కింట్లో నివాసముంటున్న భార్యాభర్తలు ప్రతీ రోజూ రాత్రి తమ పడకగది కిటికీలు తెరుచుకుని మరీ శృంగారాన్ని చేసేవారు. ఇక ఆ శబ్దం బాధితురాలిని ఇబ్బంది పెట్టడమే కాదు.. చిరాకు కూడా పుట్టించేది.

సదరు బాధితురాలు ఎన్నిసార్లు చెప్పినా.. ఆ దంపతులు ఆమె మాట వినిపించుకోలేదు. అంతేకాదు.. ఆ దంపతులు, వారి కుటుంబసభ్యులు బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడటంతో పాటు చంపేస్తామని బెదిరించారు. దీంతో ఇక చేసేదేమీలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. తమకు సరైన రక్షణ కల్పించాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళ ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 504, 506, 509, 34 కింద కేసు నమోదు చేశారు.