Viral Video: వామ్మో.! పది అడుగుల భారీ నాగుపామును ఇట్టే పట్టేసిందిగా.. గగుర్పొడిచే వైరల్ వీడియో..

పాము పేరు వింటే చాలు మనుషులు ఆమడదూరం జరుగుతారు.. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు. అలాంటిది పాము మన దగ్గరలో ఉంటే..

Viral Video: వామ్మో.! పది అడుగుల భారీ నాగుపామును ఇట్టే పట్టేసిందిగా.. గగుర్పొడిచే వైరల్ వీడియో..
Snake

Edited By: Anil kumar poka

Updated on: Jun 03, 2021 | 8:16 PM

పాము పేరు వింటే చాలు మనుషులు ఆమడదూరం జరుగుతారు.. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు. అలాంటిది పాము మన దగ్గరలో ఉంటే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఒక్కసారిగా ఝల్లుమంటుంది. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా పది అడుగుల భారీ విష సర్పాన్ని చేతులతో ఇట్టే పట్టేసింది. ఆ పాము ఆమె శరీరాన్ని చుట్టుకుంటున్నా కూడా అడరలేదు.. బెదరలేదు.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఓ యువతి ధైర్యంగా తన చేతులతో భారీ పామును పట్టుకుంది. ఆమె పట్టు నుంచి పాము తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఈ సంఘటన గత నెల 21వ తేదీన వియత్నాంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో వెళ్తున్న ఇద్దరు యువకులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. పామును పట్టుకున్న మహిళ ముఖం సరిగ్గా కనిపించట్లేదు గానీ.. ఆమె ధైర్యసాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ గురి కావడమే కాకుండా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..