ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా అనిపిస్తాయి. ఇంకొన్ని అయితే పక్కాగా మీమ్స్‌ను తలపిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
ఈ వీడియోను సుస్మిత అనే ట్విట్టర్ యూజర్ తన పేజీలో షేర్ చేసింది. ‘ఇన్‌స్టామార్ట్ నుంచి వంకాయ్‌ను ఆర్డర్ చేసి.. నా చెల్లిని రోస్ట్ చేయమన్నాను. అందుకు బదులుగా ఆమె ఈ వీడియో పంపింది’. ఇక ఈ వీడియోలో ఆమె చెల్లి.. వంటగదిలో వంకాయ్‌ను ఉంచి.. దాన్ని పట్టుకుని తిడుతుంది. సుస్మిత వంకాయ్‌ను రోస్ట్ చేయమని చెప్తే.. ఆమె చెల్లి రోస్ట్ అంటే తిట్టడం అనుకుంటుంది. వేయించడానికి బదులు తిట్ల దండకం మొదలుపెడుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Ordered brinjal from instamart and told my sister to roast it, this is what she has sent me pic.twitter.com/e62uG09yNf
— Susmita (@shhuushhh_) June 20, 2023