
ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల్లో గొడవలు ఎక్కువయ్యాయి. ఇక ఫ్రీ బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇలాంటి గొడవలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్రీ బస్సులో సీటు కోసం చాలా సార్లు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇలాంటి గొడవల కారణంగా తోటి ప్రయాణికులు కూడా భయంతో వణికిపోతున్నారు. ఎవరు భయపడినా, ఎవరు అడ్డుకున్న ఆగేది లేదంటూ ఆడవాళ్లు బస్సులో రెచ్చిపోయి వీరంగం సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వార్తల్లోనే కాకుండా, సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడు బస్సు, రైలు కాదు.. ఏకంగా గాల్లో ఎగురుతున్న విమానంలో ఓ మహిళ చేసిన గొడవ మామూలుగా లేదు. రన్నింగ్ విమానంలో వెనుక కూర్చున్న ప్రయాణికులతో ఆమె చేసిన వాగ్వాదం కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా విమాన ప్రయాణం అంటే చాలా వరకు ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్లు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాగే, విమాన ప్రయాణాల్లో చాలా వరకు గొడవలు, కొట్లాటాలు వంటివి జరగవు. ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్లు మాత్రమే కూర్చుని వెళ్తుంటారు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళ ప్రయాణికురాలు విమానంలో తన వెనుక సీటులో ఉన్న ప్రయాణికులతో వాగ్వాదం పెట్టుకుంది. వారితో గట్టిగా అరురూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. దాంతో వెంటనే ఎయిర్ హోస్టేస్ సిబ్బంది అక్కడకు వచ్చారు. ఏం జరిగిందో ఆరా తీసి వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
Fight for 11A seat pic.twitter.com/hyHV6Wxl7f
— maithun (@Being_Humor) June 18, 2025
అయితే, వారి మధ్య గొడవకు కారణం 11A సీటు విషయంలో వివాదంగా తెలుస్తోంది.. కానీ, వీడియోలో మాత్రం ఆమె గట్టిగా అరుస్తూ.. .చేతులు చూపిస్తు ఎదుటివారికి వార్నింగ్ ఇస్తుంది. ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిని కూడా ఆమె వాయించేసింది. ఎయిర్ హోస్టేస్ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..