యూ ట్యూబ్‌లో, వెబ్ సైట్స్‌లో చూసి వంటలు ట్రై చేస్తున్నారా? జాగ్రత్త సుమీ!. మరీ బ్లైండ్‌గా ఫాలో అయితే మోహం మాడిపోవడం ఖాయం. ఎందుకు ఇంతలా చెప్తున్నామ్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. కోడిగుడ్డు పేలి మోహం అంతా కాలిపోయినా వారిని ఎవరైనా చూశారా?. కోడి గుడ్డు ఎందుకు పేలుతుంది? పేలినా మోహమంతా ఎందుకు కాలుతుంది..సిల్లీ క్వచ్ఛన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పే న్యూస్ వింటే మీకు దిమ్మ తిరగడం ఖాయం.
ఇంగ్లాండ్‌లోని వర్సెస్టర్‌సైర్ నగరానికి చెందిన బెదానీ రాసర్ అనే యువతి డెలీష్ అనే వెబ్‌సైట్‌లో చూసి కోడిగుడ్డు కూరను ట్రై చేస్తోంది. అచ్చంగా అందులో చెప్పినట్టే ఇన్‌స్రక్షన్స్ ఫాలో అవుతూ.. మైక్రోవేవ్ ఓవెన్‌లో గుడ్లు పెట్టింది. అవి హీట్ ఎక్కువయ్యి పేలకుండా ఉండాలంటే సాల్ట్ వేయాలని వెబ్‌సైట్‌లో ఉంది. దాంతో ఆమె కూడా అలాగే చేసి ఓవెన్‌లో పెట్టింది.ఇక ఉడికి పోయాయని బయటకు తీయ్యగానే ఒక్కసారిగా గుడ్లు బ్లాస్ట్ అయ్యాయి. దీంతో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పటల్ వెళ్లడం కాస్త లేట్ అయితే కన్ను తీసేయాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారట. మరి రాసిన వెబ్ సైట్ వారి తప్పో, ఈవిడ వంటలో లోపమో తెలీదు కానీ..చావు తప్పి కన్నులోట్టబోయినంత పనయ్యింది. ఏదైనా లెర్నర్స్ వంటలు నేర్చకునేముందు కాస్త జాగ్రత్తలు వహించండి.