వైద్యుల సలహా లేకుండా దగ్గు, జలుబుకు మందు తీసుకున్న మహిళ కంటి నుంచి రక్తం, పాము చర్మంలా ముడతలు

|

Apr 17, 2024 | 3:12 PM

హెచ్చరికలను పట్టించుకోకుండా వైద్యుల సలహా తీసుకోకుండానే దగ్గు, జలుబు , జ్వరానికి ఇంగ్లీషు మందు వేసుకుంటే ఏం జరుగుతుందో ఈ మహిళే సాక్షి. జలుబు చేస్తే ఒక్కోసారి డాక్టర్ సలహా కూడా తీసుకోకుండా మందులు వేసుకుంటాం.. ఈ మహిళ కూడా అదే తప్పు చేసింది. ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఇబుప్రోఫెన్ అనే నొప్పి నివారిణిని మెడిసిన్ తీసుకుంది. కొంచెం సేపటికి కళ్ళు ఎర్రగా, ముఖం పాము చర్మంలా ముడతలు పడింది. పెదవులపై పసుపు పొర ఏర్పడి, కళ్లలోంచి రక్తం కారడం మొదలైంది.

వైద్యుల సలహా లేకుండా దగ్గు, జలుబుకు మందు తీసుకున్న మహిళ కంటి నుంచి రక్తం, పాము చర్మంలా ముడతలు
Woman Suffers Horrific And Rare Reaction
Follow us on

జలుబు, జ్వరం, దగ్గు ఇవి సీజనల్ వ్యాధులు కనుక ఎవరైనా వీటి బారిన పడితే.. హాస్పటల్ కు వెళ్లకుండానే సమీపంలోని మెడికల్ షాప్ దగ్గరకు వెళ్లి మెడిసిన్స్ తెచ్చుకుని వేసుకుంటారు. ఇంటి వైద్యం చేసుకుంటారు. అయితే ఇలా చేయడం ఒకొక్కసారి ప్రమాదానికి కారణం అవుతుందని ఏ మెడిసిన్స్ తీసుకోవాలన్నా తప్పని సరిగా వైద్యుల సలహా తీసుకోమని హెచ్చరిస్తూ ఉంటారు.. కానీ ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా వైద్యుల సలహా తీసుకోకుండానే దగ్గు, జలుబు , జ్వరానికి ఇంగ్లీషు మందు వేసుకుంటే ఏం జరుగుతుందో ఈ మహిళే సాక్షి. జలుబు చేస్తే ఒక్కోసారి డాక్టర్ సలహా కూడా తీసుకోకుండా మందులు వేసుకుంటాం.. ఈ మహిళ కూడా అదే తప్పు చేసింది. ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఇబుప్రోఫెన్ అనే నొప్పి నివారిణిని మెడిసిన్ తీసుకుంది. కొంచెం సేపటికి కళ్ళు ఎర్రగా, ముఖం పాము చర్మంలా ముడతలు పడింది. పెదవులపై పసుపు పొర ఏర్పడి, కళ్లలోంచి రక్తం కారడం మొదలైంది.

Ibuprofen సాధారణంగా సురక్షితమైనది. అయినా సరే వైద్యుల సలహా లేకుండా దానిని తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. అందుకనే డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదని ప్రతి మాత్రలపైనా, టానిక్ సీసాలపై రాసి ఉంటుంది. అయితే ఇరాక్ కి చెందిన మహిళ కూడా తప్పు చేసింది. వైద్యుల సలహా తీసుకోకుండా చలికి చేయి నొప్పిగా ఉందని Ibuprofen తీసుకుంది. దీని తర్వాత ఆమెకు ఈ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి.

ఔషధం శరీరం రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు ఇలా జరుగుతుంది. శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది. అప్పుడు శరీరానికి హాని చేయడం ప్రారంభిస్తుంది. దీంతో శరీరంపై  పొక్కులు, వాపులు వస్తాయి. వైద్య పరిభాషలో దీనిని స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ అంటారు. ఇది అరుదైన ఇన్ఫెక్షన్.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆ మహిళ తినలేక, తాగలేక ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది.  మహిళకు ఇంతకు ముందు ఏదైనా వ్యాధి ఉందా అనే దానిపై సమాచారం అందుబాటులో లేదు. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు మరణానికి కారణమవుతాయి. చాలా సార్లు తీవ్రమైన చర్మ వ్యాధులు వస్తాయి. ఆరోగ్యకరమైన కణాలు, అనేక రక్త నాళాలు ప్రభావితం కావచ్చు. ప్రతిచర్యకు ముందు 400 mg ఇబుప్రోఫెన్ రెండు మాత్రలు తీసుకున్నట్లు మహిళ వైద్యుడికి చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..