Viral Video: మంచు పర్వతాల్లో ఎలుగుబంటిని చుట్టుముట్టిన తోడేళ్లు.. వీర లెవెల్‌లో పోరాటం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

| Edited By: Anil kumar poka

Sep 04, 2021 | 8:33 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి..

Viral Video: మంచు పర్వతాల్లో ఎలుగుబంటిని చుట్టుముట్టిన తోడేళ్లు.. వీర లెవెల్‌లో పోరాటం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
Bear
Follow us on

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో తోడేళ్ల గుంపుతో ఎలుగుబంటి చేసిన పోరాటాన్ని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు.

సాధారణంగా తోడేళ్లు అత్యంత క్రూరమైన ప్రెడేటర్స్ అని చెప్పొచ్చు. దాని వాతావరణంలో అది ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే ఎలుగుబంటి కూడా తక్కువేమి కాదు. అది కూడా తోడేళ్లతో ధీటుగా పోరాడుతుంది. ఈ రెండు సమవుజ్జీల మధ్య తాజాగా మంచు పర్వతాలలో యుద్ధం జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ మంచు పర్వతంపై ఎలుగుబంటి తనకు దొరికిన ఎరను ఇంచక్కా లాగిస్తున్నట్లు చూడవచ్చు. అయితే అప్పుడే తోడేళ్ల గుంపు దాన్ని చుట్టుముడతాయి. ఇంకేముంది యుద్ధం మొదలైనట్లే. తన ఎరను తోడేళ్ళకు దక్కనివ్వకుండా వాటితో ఎలుగుబంటి పోరాటానికి దిగుతుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

 

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..