సెల్ఫీల పిచ్చితో యువత తమ ప్రాణాలను కోల్పోతున్నారు. డేంజర్ జోన్ లో సెల్పీల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఓ వైపు ప్రాణాలు పోగుట్టుకుంటున్నా యువతకు సెల్ఫీ పిచ్చి మాత్రం వదలట్లేదు. తాజాగా మరో సెల్ఫీ మరణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అడవి ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.
ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీకాంత్ రామచంద్ర సాత్రే (23) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి గడ్చిరోలిలో కేబుల్ లేయింగ్ పని కోసం వెళ్ళాడు. అయితే గురువారం అబాపూర్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు సంచరిస్తున్నట్లు తెలిసి.. దానిని చూసేందుకు వెళ్ళాడు. అనుకోకుండా అక్కడ ఏనుగు కనిపించడంతో అతడు దాంతో సెల్ఫీ దిగాలని ట్రై చేశాడు. ఏనుగుతో శ్రీకాంత్ సెల్ఫీకి ఫోజులిస్తున్న క్రమలోనే ఆగ్రహించిన గజరాజు అతడిని తొక్కి చంపింది. ఏనుగు దాడి నుంచి ఇద్దరు తృటిలో తప్పించుకోగా.. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సంఘటన స్థానికుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇదిలా ఉంటే, రెండు రోజుల క్రితం చిట్టగాంగ్, గడ్చిరోలి అటవీ ప్రాంతం నుంచి అడవి ఏనుగు బయటకు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది. ముట్నూర్ అటవీ ప్రాంతంలోని అబాపూర్ అడవుల్లో ఏనుగు సంచరిస్తోందని అటవీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..