Viral Video: సాధారణంగా చిరుత పులులు అడవి పందుల జోలికి వెళ్లవు. ఎందుకంటే అవి చిరుతల కంటే చాలా బలమైనవి. వేగంగా పరుగెత్తగలవు కూడా. వాటి కోర దంతాలతో… చీతాను కూడా… ఎత్తి గాల్లోకి ఎగరెయ్యగలదు. అడవి పంది దాని కోర దంతాలతో గనక గుచ్చిందంటే… ఇక ప్రాణాలు పైకే. అలాంటి దానితో పెట్టుకున్న ఓ చిరుతపులికి చుక్కలు కనిపించాయి. అడవి పంది దాడికి ప్రాణాలు పంజాతో పట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది.
ట్విట్టర్ ఖాతాలో జనవరి 11న పోస్ట్ చేసిన ఈ వీడియోని 24 గంటల లోపే దాదాపు లక్షమంది పైగా నెటిజన్లు వీక్షించారు. ఇందులో ఓ అడవి పందిపై దాడి చేద్దామని ఆఫ్రికన్ చిరుత ప్రయత్నించింది. అడవిపంది వెంట పడి… పరుగులు పెట్టించింది. ఐతే… తెలివైన అడవిపంది… చిరుత తన దగ్గరకు రాగానే… పరుగును తగ్గించింది. అది కనిపెట్టలేకపోయిన చిరుత మరింత వేగంగా పరుగెడుతూ… అడవిపందికి అడ్డంగా నిలుచుంది. తన ముందుకు వచ్చిన చీతాను చూసి అడవిపంది రివర్స్ అయ్యింది. తన పదునైన కొమ్ములతో చిరుతపై విరుచుకుపడింది. అడవి పంది దాడికి చిరుత భయంతో వణికిపోయింది. “నన్ను వదిలేయ్ బాబోయ్” అన్నట్లుగా పరుగులు పెట్టి పారిపోయింది. మొత్తానికి ప్రాణాలు దక్కించుకుంది. అందుకే సాధారణంగా అడవిపందుల జోలికి ఈ క్రూరమృగాలు వెళ్లవు. ఆ చీతా పారిపోయింది గానీ… పోరాడి ఉంటే మాత్రం అడవిపంది ముందు చచ్చేదే. అందుకే అంతరించిపోయే జంతువుల జాబితాలో అడవిపందులు లేవు. వాటి సంఖ్య ఎప్పట్లాగే తగ్గకుండా ఉంది. వీడియోలో దృశ్యం ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెడీ కామెంట్స్ పెడుతున్నారు. “ఇది చూడటానికి ఫుట్‌బాల్ లాగా ఉంది” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… “అడవిపందితో పెట్టుకోవద్దు” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
Viral Video:
Turning the tables #turntables #surprise
*source unknown pic.twitter.com/QaoIdgx9Zz
— Morissa (Dr. Rissy) Schwartz (@MorissaSchwartz) January 10, 2022
Also read:
Hyderabad Robbery: ఎస్ఆర్ నగర్‌లో భారీ చోరీ.. 1 కిలో బంగారం, 22 లక్షల రూపాయలు లూటీ..