Viral Video: ప్లేట్‌లో చికెన్ వింగ్స్ పెట్టిన భార్య.. తిన్న తర్వాత భర్తకు ఫ్యూజులు ఔట్.. చూస్తే షాకవుతారు!

|

Feb 08, 2022 | 3:59 PM

క్రియేటివిటీతో చేసే పని ఏదైనా కూడా కొంచెం కొత్తగా ఉంటుందంటారు. సరిగ్గా దీనికి అర్ధం పట్టేలా ఓ మహిళ చేసిన వెరైటీ యాక్ట్...

Viral Video: ప్లేట్‌లో చికెన్ వింగ్స్ పెట్టిన భార్య.. తిన్న తర్వాత భర్తకు ఫ్యూజులు ఔట్.. చూస్తే షాకవుతారు!
Chicken Wings
Follow us on

క్రియేటివిటీతో చేసే పని ఏదైనా కూడా కొంచెం కొత్తగా ఉంటుందంటారు. సరిగ్గా దీనికి అర్ధం పట్టేలా ఓ మహిళ చేసిన వెరైటీ యాక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త పుట్టినరోజును వెరైటీగా జరిపి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆమె ఏ పని చేసిందో మీరూ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన భర్తకు ఎంతో ఇష్టమైన చికెన్ వింగ్స్‌ను ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక నోరూరిపోయేలా ఉన్న వాటిని చూసి అతగాడు ఒక పీస్ తీసుకుంటాడు. దాన్ని కొరికి చూస్తాడు. అంతే.! ఇదేంటి టేస్ట్ ఇలా ఉందని వాటిని సరిగ్గా గమనించగా.. అదొక కేక్ అని అతడికి అప్పుడు అర్ధమవుతుంది. ఆ సమయంలో అతడి రియాక్షన్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా, ఈ వీడియోను ‘క్రిస్టీ సారా’ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 6 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అలాగే 5.81 లక్షల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.