కొంతమంది యువకులు వృద్ధులకంటే నీరసంగా బద్ధకంగా బతికేస్తూ ఉంటారు. ఇలాంటి వారికీ ఆదర్శంగా కొంతమంది వృద్ధులు నిలుస్తూ ఉంటారు. తమ వయసు సంకల్పానికి అడ్డుకాదని తరచుగా నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బామ్మా.. యువతతో పోటీపడుతూ మారథాన్ లో పాల్గొంది. అవును 80 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండేంత అదృష్టం అతి కొద్ది మందికేనని చెప్పొచ్చు. అలాంటి వయసులో ఓ బామ్మ ఏకంగా పరుగు పందెంలో హుషారుగా పాల్గొన్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ముంబై వాసులు ఈ పరుగులో పాల్గొనగా.. భారతి అనే వృద్దురాలు చీర కట్టుకుని, కాళ్లకు షూ ధరించిన ఓ బామ్మ వారితో కలసి పరుగు అందుకున్నారు. ఆమెను చూసిన చాలా మంది ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యువతరానికి బామ్మ మంచి స్ఫూర్తినీయం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమంలో 55 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. అందరిలో ఈ బామ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతితో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని.. 4.2 కిలోమీటర్ల దూరాన్ని 51 నిమిషాల్లో చేరుకున్నారు. మారథాన్‌లో ఈ బామ్మ పాల్గొనడం ఇది ఐదోసారి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..