Viral News: టెట్ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు.. బిడ్డకు ఏం పేరు పెట్టారంటే..

|

Jan 25, 2022 | 2:09 PM

టీచర్ (Teacher) కావాలన్నది ఆమె కల (Dream). అందుకోసం ఎంతో కష్టపడి చదివింది. భర్త కూడా భార్య ఆశయానికి అండగా నిలబడ్డాడు.  గర్భం దాల్చినా తన ప్రిపరేషన్ (Exam Preparation) ను కొనసాగించింది

Viral News: టెట్ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు.. బిడ్డకు ఏం పేరు పెట్టారంటే..
Follow us on

టీచర్ (Teacher) కావాలన్నది ఆమె కల (Dream). అందుకోసం ఎంతో కష్టపడి చదివింది. భర్త కూడా భార్య ఆశయానికి అండగా నిలబడ్డాడు.  గర్భం దాల్చినా తన ప్రిపరేషన్ (Exam Preparation) ను కొనసాగించింది.  అయితే పరీక్షా సమయానికి ఆమె ఆ మహిళ గర్భంతో ఉంది. అయినా తన కలను నెరవేర్చుకోవడానికి పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అయితే పరీక్ష రాస్తుండగానే పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో ఇన్విజిలేటర్ ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి అపాయం కలగలేదు. పైగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా  ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాస్తుండగానే బిడ్డ పుట్టడంతో ఆస్పత్రి వైద్యులు  ఆ పిల్లాడికి ‘టెట్’  అని నామకరణం చేశారు.  ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

టెట్ పరీక్షకు గుర్తుగానే..

నాన్ పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవికి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా మారి పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆశ. ఇందులో భాగంగానే కొన్ని నెలల క్రితం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసింది.  అయితే  పరీక్ష సమయానికి ఆమె నిండు గర్భంతో ఉంది.  ఆదివారం టెట్ పరీక్ష రాసేందుకు భర్త సహాయంతో గజ్రైలా లోని డిగ్రీ కళాశాలకు వెళ్లింది. అయితే ఎగ్జామ్ రాస్తుండగానే మధ్యలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్ర నిర్వాహకులు హుటాహుటిన అంబులెన్స్ ను పిలిపించి రేణు దేవిని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించాడు. కాగా టెట్ పరీక్షకు గుర్తుగా ఆస్పత్రి సిబ్బంది ఆ పసివాడికి ‘టెట్’ అని పేరు పెట్టారు.  కాగా ప్రస్తుతం తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు చెప్పుకొచ్చారు.

Also read: Chinna Jeeyar Swamy: గవర్నర్ తమిళి సైతో సమావేశమైన చినజీయర్ స్వామి..

Anil Ambani Son Wedding: త్వరలో అంబానీ ఇంట మరో గ్రాండ్ వెడ్డింగ్.. నెట్టింట వైరలవుతోన్నఅనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..

Coronavirus: శాంతిస్తోన్న కరోనా.. వరుసగా రెండో రోజూ తగ్గిన కొత్త కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..