Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేది మీ సీక్రెట్ చెప్పేస్తుంది!

|

Mar 30, 2022 | 11:54 AM

సైకాలజీ అనేది ఓ మహా సముద్రం అని అంటారు. ఒక వ్యక్తి చేసే పనుల బట్టి కాదు.. అతడు చూసే చూపు.. ప్రవర్తించే తీరుతో..

Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేది మీ సీక్రెట్ చెప్పేస్తుంది!
Optical Illusion
Follow us on

ఇతరుల సైకాలజీ గురించి తెలుసుకోవడంలో ప్రతీవారికి కుతూహలం ఉంటుంది. అలాగే తమ గురించి వేరేవారు ఏం అనుకుంటున్నారు.? క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పుకుంటున్నారు.? అనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు. అందుకే సైకాలజీ అనేది ఓ మహా సముద్రం అని అంటారు. ఒక వ్యక్తి చేసే పనుల బట్టి కాదు.. అతడు చూసే చూపు.. ప్రవర్తించే తీరుతో.. వారు ఎలాంటి వాళ్ళో ఈజీగా చెప్పేయొచ్చు. సైకాలజిస్టులు ఇట్టే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని, వారి మైండ్ సెట్‌ను కనిపెట్టేస్తారు.

ఇక ఆప్టికల్ ఇల్యుషన్స్ విషయానికొస్తే.. మనం చూసే చూపు.. మన మెదడు ఎలా థింక్ చేస్తోందో చెబుతుంది. దాని బట్టే మీ పర్సనాలిటీ, మైండ్ సెట్‌ను అంచనా వేయొచ్చు. ఇటీవల కాలంలో నెట్టింట ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ గురించి ఇప్పుడు చూద్దాం..

పైన పేర్కొన్న ఫోటోను మీరు చూసినప్పుడు.. మొదటిగా మీకు కనిపించింది ఏది.? ఆ ఫోటోలో ‘A’ అక్షరం, కారు, గూఢచారి దాగి ఉన్నారు. ఈ మూడింటిలో మొదటిగా ఆ చిత్రాన్ని చూసినప్పుడు.. మీకు ఏది కనిపిస్తుందో.. అదే మీ వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుందని మానసికవేత్త ‘Your Tango’ చెబుతున్నారు.

చిత్రంలో మొదటిగా మీకు ‘A’ అక్షరం కనిపించినట్లయితే.. ఎలప్పుడూ ఓ రచయిత కావాలని కోరుకుంటారట. బహుశా రొమాంటిక్ నవల లేదా పిల్లల పుస్తకాన్ని రచించాలని అనుకుంటారని Tango అంచనా వేస్తున్నారు.

మొదటిగా కారును చూసినట్లయితే.. మీలో ‘జేమ్స్ బాండ్ స్టైల్’లో డిటెక్టివ్ లక్షణాలు ఉండి.. రహస్యాలు వెలికి తీసేందుకు ప్రపంచాన్ని చుట్టాలన్నది మీ కోరిక. ఎలప్పుడూ ఏదొక సాహాసం చేయాలని పరితపిస్తారు. కానీ రియాలిటీలో జీవిస్తుంటారు.

గూఢచారిని ముందుగా చూసినవారి విషయానికొస్తే.. వీరు ప్రతీ ఒక్కరి రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఆ సమాచారంతో వారికి సహాయం చేయాలని భావిస్తారు.

Also Read: Viral Video: ఏటీఎం నుంచి వింత శబ్దాలు.. భయంతో డోర్ ఓపెన్ చేయగా కళ్లు చెదిరే సీన్..