కారు వెనక భాగంలో అద్దం మీద ఉండే గీతలను గమనించారా..? వాటి వల్ల ఉపయోగం ఏంటో తెలుసా..?

|

Mar 23, 2023 | 6:53 PM

ఇప్పటికే చాలా మోడల్స్ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. అయితే కార్లు కు సంబంధించి చాలా విషయలు అందరికి తెలిసే ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు.

కారు వెనక భాగంలో అద్దం మీద ఉండే గీతలను గమనించారా..? వాటి వల్ల ఉపయోగం ఏంటో తెలుసా..?
Car
Follow us on

ఈ మధ్య కాలంలో కార్ల వాడకం ఎక్కువైంది. చాలా మంది బైకుల కంటే కార్లు కొనుక్కోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. యువతలో ముఖ్యంగా కార్లు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మోడల్స్ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. అయితే కార్లు కు సంబంధించి చాలా విషయలు అందరికి తెలిసే ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. అందులో ఇదొకటి. మనం కార్లను సరిగ్గా చూస్తే వెనక అద్దం పై గీతాలు ఉంటాయి. అవి అంత తేలికగా కనిపించవు. కాస్త పట్టి చూస్తే ఆ గీతాలు కనిపిస్తాయి. అవి ఎందుకు ఉంటాయో తెలుసా..? వాటి వల్ల కారుకు ఎంత ఉపయోగమో తెలుసా..?

కారు వెనక అద్దంలో ఉండే గీతాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ విండ్ షీల్డ్ లైన్స్ మనకు వర్షంలో కారు నడపడానికి చాలా ఉపయోగపడుతాయి. విండోస్ మీద ఉండే ఈ లైన్స్ ని డీ ఫాగర్స్ (Defoggers) అని అంటారు.

ఇవి ఎలక్ట్రికల్ లైన్స్. వీటిగుండా కరెంటు ప్రవహిస్తుంది. దానివలన వెనుక అద్దం వేడెక్కుతుంది. దాంతో విండో మీద చేరిన తేమ, మంచు ఆ వేడి వల్ల కరిగిపోయి.. తొలిగిపోతుంది. దాంతో ఒక స్పష్టమైన వ్యూ కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలియదు.