AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పశువుల సంతకు వచ్చిన ఆవును రక్షించిన ముస్లిం యువకుడు.. కన్నీళ్లు పెట్టేస్తున్న క్షణం..!

ప్రస్తుత సమాజంలో మతం, రాజకీయాల పేరుతో విభేదాలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మనుషుల మధ్య ఇంకా మానవత్వం, పరస్పర గౌరవం బతికే ఉన్నాయని నిరూపించే ఒక ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని మగ్రాహట్ ప్రాంతానికి చెందిన ఒక పశువుల సంత నేపథ్యంలో సాగిన ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

Watch: పశువుల సంతకు వచ్చిన ఆవును రక్షించిన ముస్లిం యువకుడు.. కన్నీళ్లు పెట్టేస్తున్న క్షణం..!
Cow Selling Bakra Mandi
Balaraju Goud
|

Updated on: May 22, 2026 | 10:42 AM

Share

ప్రస్తుత సమాజంలో మతం, రాజకీయాల పేరుతో విభేదాలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మనుషుల మధ్య ఇంకా మానవత్వం, పరస్పర గౌరవం బతికే ఉన్నాయని నిరూపించే ఒక ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని మగ్రాహట్ ప్రాంతానికి చెందిన ఒక పశువుల సంత నేపథ్యంలో సాగిన ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇది అసలైన భారతీయతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

బక్రీద్ పండుగకు ముందు మగ్రాహట్‌లో మేకల సంతను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒక పేద హిందూ వృద్ధుడు తన ఆవును అమ్ముకోవడానికి ఆ సంతకు తీసుకువచ్చాడు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు అతని మతం గురించి, ముస్లింల పండుగ వేళ ఆవును అమ్మడానికి తీసుకురావడం గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. వాతావరణం కాస్త గంభీరంగా, ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో.. అక్కడే ఉన్న ఒక ముస్లిం యువకుడు జోక్యం చేసుకున్నాడు.

ఆ యువకుడు ఎంతో వివేకంతో, ప్రశాంతంగా వృద్ధుడికి సమాధానం ఇచ్చాడు. “ఇది మా త్యాగాల పండుగ, ఇది కేవలం మేకల సంత. మీ ఆవును ఇక్కడికి తీసుకురావద్దు, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జంతువులను వధించబోతున్నారు. మేము మీ ఆవును, మీ నమ్మకాలను అగౌరవపరచలేము. కొద్దిసేపట్లో ఎవరో ఒకరు వచ్చి ఆవును వేలం వేసే ప్రమాదం ఉంది, కాబట్టి దీనిని సురక్షితంగా వెనక్కి తీసుకువెళ్ళిపోండి.” అంటూ కోరారు.

ఆ ముస్లిం యువకుడి పరిణతి చెందిన మాటలు, హిందూ మత భావనల పట్ల అతను చూపిన గౌరవం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నేను హిందువునే అయినా, నా ముస్లిం సోదరుడి వివేకాన్ని గౌరవిస్తున్నాను” అని ఒకరు కామెంట్ చేయగా.. “ఈ అబ్బాయికి సెల్యూట్, వీళ్లే అసలైన భారతీయులు” అని మరొకరు కొనియాడారు. అదే సమయంలో ఆ వృద్ధుడి నిస్సహాయతపై కూడా జనం భావోద్వేగానికి గురయ్యారు. “ఏ పరిస్థితులు ఒక వ్యక్తిని మేకల సంతలో ఆవును అమ్మేలా చేశాయో? పేదరికం, నిస్సహాయత ఆ వృద్ధుడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియో సమాజంలో మతాలకతీతంగా ఉండాల్సిన సోదరభావాన్ని, పరస్పర గౌరవాన్ని చాటిచెప్పడమే కాకుండా, రాజకీయాల కంటే మానవత్వమే మిన్న అని మరోసారి నిరూపించింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us