Viral Video: క్లీనిక్‌లో లేడీ డాక్టర్ ఒక్కరే ఉండగా వచ్చి.. డోర్ చాటున నిల్చుని..
కోల్‌కతాలో లేడీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లడవుతున్న వేళ.. అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ నీచుడు లేడీ డాక్టర్ ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కామ కుక్క.. ఇంకా ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు వీడ్ని. మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల మైండ్ సెట్ మారడం లేదు. తాజాగా కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి.. అమె దారుణంగా హత్య చేశాడు ఉన్మాది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేశం చూసిన మరో నిర్భయ ఘటన ప్రజలు అంటున్నారు. ఈ హేయమైన చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా న్యాయం కోసం నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, డ్యూటీలో ఉన్న డాక్టర్ పట్ల ఓ కామంధుడు వికృతంగా ప్రవర్తించిన మరో దారుణం అదే రాష్ట్రంలో చోటుచేసుకుంది. క్లీనిక్‌లో లేడీ డాక్టర్ ఒక్కరే ఉండగా.. అక్కడివి వచ్చిన ఓ యువకుడు తన ప్రవేట్ పార్ట్ చూపిస్తూ.. నీచపని చేశాడు. ఆమె అరవడంతో.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ అసహ్యకరమైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసింది.
ఆ ఉన్మాది అకస్మాత్తుగా క్లినిక్ లోపలికి వచ్చి, ప్యాంటు విప్పి, తన ప్రైవేట్ భాగాలను వైద్యుడికి చూపించి, ఆపై సైకిల్‌పై పారిపోయాడు.. ఈ దృశ్యాన్ని వైద్యురాలు తన మొబైల్‌లో రికార్డు చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. “అతని ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయాలి’’ అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మహిళలకు రక్షణ ఎక్కడుంది. మరీ ఇంత బరి తెగింపా” అని మరో మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.
వీడియో దిగువన చూడండి
Video from West Bengal, Idk the time, Idk the place, but I know that it matters.
This mf is standing with an open phallus in front of a lady doctor in charge of a medical facility in rural Bengal. He runs away as the lady charges towards him.
Idk if charges have been pressed,… pic.twitter.com/IGnJBPrEGj
— MrSeeker (@mr_seeker_1) August 13, 2024
మహిళలు, పిల్లల హెల్ప్‌లైన్ నంబర్లు:
చైల్డ్‌లైన్ ఇండియా – 1098; తప్పిపోయిన పిల్లలు, మహిళలు – 1094, మహిళల హెల్ప్‌లైన్ – 181; నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెల్ప్‌లైన్ 112,హింసకు వ్యతిరేకంగా జాతీయ మహిళా కమీషన్ హెల్ప్‌లైన్ – 7827170170, సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ – 1091/1291.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..