వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా. అంతేకాదు.. రెండు జీవితాలను కలిపే పవిత్ర బంధం.. అలాంటి పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా, వైభవంగా జరుపుకుంటారు. ఇక కల్యాణ వేదిక కోసం కొందరు గుడిలో పెళ్లి చేసుకుంటే.. కొందరు చర్చిలో వివాహం చేసుకోవాలని అనుకుంటారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, ఖరీదైన హోటళ్లు వంటవి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇక్కడో జంట విచిత్రంగా బాత్రూంలో పెళ్లి చేసుకుంది. చీ అదేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా..? కానీ, మీరు విన్నది నిజమే..నిజంగానే ఒక జంట బాత్‌రూంలో పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ వధువు అయినా టియానా ఓ షాపులో పనిచేసే యువతి. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే ప్రత్యేక మనస్తత్వం కలిగిన యువతి.. అందుకే పెళ్లంటే కొంచం కాదు చాలా వెరైటీగా చేసుకుంది. అదేనండి ఈ టియానా బాత్రూంలో పెళ్లి చేసుకుంది. టియానా తన ఆలోచనను కాబోయే వరుడితో చెప్పింది. వివాహానికి అత్యంత ప్రత్యేకమైన వేదిక ఈ డిస్కో-నేపథ్య బాత్రూమ్ అని ఆమె నిర్ణయించుకుంది. HOP దుకాణాలు వాటి ప్రత్యేకమైన బాత్‌రూమ్‌లకు ప్రసిద్ధి చెందాయి. టియానా పెళ్లి కోసం బాత్ రూంను కల్యాణ వేదికగా రంగురంగుల దీపాలతో అలంకరించారు. పైకప్పు నుండి మెరిసే డిస్కో లైట్లు వేలాడదీశారు. రంగు రంగుల బెలూన్లతో డెకరేట్ చేశారు.
బటన్ నొక్కగానే విద్యుత్ లైట్ల ప్రదర్శన మొదలవుతుంది. HOP షాప్స్ స్టోర్‌లో జరిగిన ఈ అపూర్వ పెళ్లి గురించి టియానా మీడియాతో మాట్లాడింది. తాము ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, దానికి తన జీవిత భాగస్వామి అంగీకరించటం, చివరకు అటువంటి ప్రత్యేకమైన వివాహ వేదికను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
టియానా పెళ్లికి పెళ్లి వేదికగా బాత్రూమ్ ను రంగురంగుల లైట్లతో అలంకరించారు. మినుకుమినుకుమనే డిస్కో లైట్ల మధ్య పైకప్పు నుండి కూడా లైట్లు వేలాడదీశారు. బెలూన్లతో అక్కడంతా బెలూన్లతో అందంగా అలంకరించారు. బాత్రూమ్‌కు వెళ్లే మార్గంలో ప్రత్యేక సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. డిస్కోలోని బాత్‌రూమ్‌లో పెళ్లి జరుగుతోందని చెప్పారు. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ నోట్ కూడా రాశారు. టియానా, లోజన్ తమ పెళ్లి దుస్తులు ధరించి ఉన్నారు. ఇక వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో టాయిలెట్‌కి వెళ్లారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..