
వంద అబద్ధాలు చెప్పి అయినా సరే.. ఒక పెళ్లి చేయాలి అనేది ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాట.. ఇవన్నీ వినడానికి చాలా అందంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు కాలం మారింది. చిన్న అబద్ధం కూడా ఎన్నో ఏళ్ల బందాన్ని విఛ్చినం చేయగలదని అనేక సందర్భాల్లో నిరూపిస్తోంది. ఈ రోజుల్లో ఎవరైనా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇలా పెళ్లి చేసినా, చేసుకున్న వారు జైలులో ఉంటారు. ఇటీవల, ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక వ్యక్తి అబద్ధం చెప్పి నమ్మించి, పెళ్లి చేసుకుని, అన్ని ఆచారాలు పూర్తయిన తర్వాత షాకింగ్ నిజం బయటపడింది. ఇప్పుడీ వార్త ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరుల పెళ్లి అనంతరం వధువు వీడ్కోలు జరుగుతోంది. అంతలోనే ఈ వివాహం రద్దు చేయబడింది. దీనికి కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వివాహ వీడ్కోలుకు ముందు వరుడు ట్రాన్స్‌జెండర్ అని తేలింది. పెళ్లి కొడుకు తేడా అని తేలడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు వధువు కుటుంబ సభ్యులు. 2026 ఫిబ్రవరి 13నే పెళ్లికి ఒప్పుకున్న కట్నకానుకలు కూడా అప్పగించినట్టుగా పెళ్లి కూతురి కుటుంబం ఆరోపించింది. ఏడు అడుగులు వేసిన తర్వాత, ఆ రోజు రాత్రి పెళ్లి ఆచారాలన్నీ సజావుగా సాగాయి. ఫిబ్రవరి 14న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లింగమార్పిడి వ్యక్తుల బృందం సాంప్రదాయ ఆశీర్వాదం ఇవ్వడానికి పెళ్లి ఇంటికి వచ్చింది. వారు తమ సమాజానికి చెందిన 22 ఏళ్ల వరుడిని గుర్తించారు. దీంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.
ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఆన్‌లైన్ వెబ్ సైట్ల ద్వారా కుదుర్చుకుంటున్న చాలా పెళ్లిళ్లు ఇలాగే విచ్ఛినం అవుతున్నాయి. ఇటువంటి మోసాలతో వివాహంపై నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారటంతో ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రజలు షాక్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..