బాలయ్యే దైవం..పెళ్లి కార్డుపై అభిమానం

నటసింహ..నందమూరి బాలకృష్ణ. ఈ సీనియర్ హీరో ఏది చేసినా సెన్సేషనే. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ తెలుగు తెరపై తిరుగులేని ముద్ర వేశారు. సౌత్‌లో లార్జర్‌దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. మాస్‌లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ నందమూరి నాయకుడికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. కొట్టినా, తిట్టినా బాలయ్యే మాకు దైవం అని ఫ్యాన్స్ చెబుతుంటారు. అలాగే నా ఫ్యాన్స్‌ని బౌన్సర్లు […]

బాలయ్యే దైవం..పెళ్లి కార్డుపై అభిమానం
Follow us

|

Updated on: May 06, 2019 | 7:23 PM

నటసింహ..నందమూరి బాలకృష్ణ. ఈ సీనియర్ హీరో ఏది చేసినా సెన్సేషనే. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ తెలుగు తెరపై తిరుగులేని ముద్ర వేశారు. సౌత్‌లో లార్జర్‌దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. మాస్‌లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ నందమూరి నాయకుడికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. కొట్టినా, తిట్టినా బాలయ్యే మాకు దైవం అని ఫ్యాన్స్ చెబుతుంటారు. అలాగే నా ఫ్యాన్స్‌ని బౌన్సర్లు తన్నడం కంటే..తాను కొట్టడం బెటరని బాలయ్యే అంటుంటారు.

బాలయ్య ఫ్యాన్స్‌కు ఆయనకు ఉన్న రిలేషన్ అలాంటిది.  తాజాగా  కర్ణాటకకు చెందిన ఓ అభిమాని శ్రీనివాసులు మాత్రం బాలకృష్ణపై తనకు గల అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ఈయన తన కుమారుడి పెళ్లి శుభలేఖపై దేవుళ్ల ఫోటోతో పాటు బాలకృష్ణ ఫోటోను ముద్రించి ఆయనపై తనకు గల అభిమానాన్ని విభిన్నంగా చూపించాడు. ఈ నెల 13న జరిగే తన కొడుకు పెళ్లికి బాలయ్యతో పాటు నందమూరి అభిమానులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరాడు. ఈ శుభలేఖపై వివిధ గెటప్స్‌లో ఉన్న బాలకృష్ణ ఫోటోలను శుభలేఖపై ముద్రించాడు.

సాధారణంగా పెళ్లి పత్రిక పైభాగంలో దేవుడి ఫోటో ముద్రిస్తారు. అయితే ఈ పత్రికలో వెంకటేశ్వర స్వామితో పాటుగా దేవుని రూపంలో ఉన్న బాలయ్య ఫోటో కూడా ముద్రించారు. కవర్‌పైన ఫోటో..లోపల వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న ఫోటో..పత్రిక బ్యాక్ సైడ్ స్టైలిష్‌గా ఉన్న మరో పిక్‌తో అచ్చు వేయించారు. ఏది ఏమైనా బాలయ్య ఫ్యాన్స్ రేంజ్ వేరు గురూ అనిపించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో