ముస్లిం పెళ్లికార్డుపై హిందూ దేవుళ్లు..! వైరల్‌ అవుతున్న వెడ్డింగ్‌ కార్డు.. సందేశం ఏంటంటే..

|

Nov 10, 2024 | 8:53 PM

ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కార్డ్ దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అమేథీ ఐక్యతకు ఉదాహరణ అని అంటున్నారు. ముస్లిం కుటుంబం హిందూ ఆచారాల ప్రకారం కుమార్తె వివాహ కార్డును ముద్రించింది. కార్డ్‌లో గణేశుడు, రాధా-కృష్ణుల ఫోటోలు ఉన్నాయి.

ముస్లిం పెళ్లికార్డుపై హిందూ దేవుళ్లు..! వైరల్‌ అవుతున్న వెడ్డింగ్‌ కార్డు.. సందేశం ఏంటంటే..
Wedding Card
Follow us on

ఏదైనా శుభ కార్యం మొదలుపెట్టేముందు ప్రతి హిందూ కుటుంబం ముందుగా వినాయకుడిని తప్పనిసరిగా పూజిస్తారు. అలాగే, పెళ్లి శుభలేఖలపై ప్రత్యేకించి గణపతి ఫోటో ఉంటుంది. అయితే, ఇక్కడ వైరల్ అవుతున్న ఓ ముస్లిం కుటుంబం పెళ్లి కార్డుపై వినాయకుడి ఫోటో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్‌ చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు నిజమైన బంధుత్వమని అంటున్నారు. సైమా బాను, ఇర్ఫాన్‌ల వివాహం నవంబర్ 8న జరిగింది. పెళ్లికి ముందు నుంచే ఈ కార్డ్ బాగా వైరల్ కావడంతో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ ముస్లిం కుటుంబం పెళ్లి కార్డుపై గణేశుడు, హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రించారు. సింగ్‌పూర్‌ బ్లాక్‌ అల్లాదిన్ గ్రామానికి చెందిన షబ్బీర్‌ టైగర్‌ కుమార్తె సైమా బానో వివాహం నవంబర్‌ 8న జరిగింది. కాగా, వీరి పెళ్లి కోసం ముద్రించిన శుభలేఖలపై హిందూ దేవుళ్లు గణేశుడితో పా టు రాధకృష్ణుల చిత్రాలు ఉన్నాయి. ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కార్డ్ దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అమేథీ ఐక్యతకు ఉదాహరణ అని అంటున్నారు. ముస్లిం కుటుంబం హిందూ ఆచారాల ప్రకారం కుమార్తె వివాహ కార్డును ముద్రించింది. కార్డ్‌లో గణేశుడు, రాధా-కృష్ణుల ఫోటోలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక, పోస్ట్‌పై ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవడం మన బాధ్యత అని సోషల్ మీడియా యూజర్ ఒకరు రాశారు. రెండు మతాల మధ్య సామరస్యం ఉండేలా హిందువులు కూడా ఇలాంటి పని చేయాలని మరొకరు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా ఈ పోస్ట్‌పై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..