Monkey Video : కోతికి యజమాని వేసిన శిక్ష..! ఎంత వేగంగా అమలు చేసిందో చూస్తే మాత్రం అవాక్కే..!??

కోతి కూడా ఎలాంటి ఎదురు చెప్పలేదు.. నోరు మూసుకుని కాళ్లు చేతులు అదుపులో ఉంచుకుని యజమాని చెప్పిన అన్ని పనులు చకచకా చేసేస్తోంది.

Monkey Video : కోతికి యజమాని వేసిన శిక్ష..! ఎంత వేగంగా అమలు చేసిందో చూస్తే మాత్రం అవాక్కే..!??
Monkey

Updated on: Feb 10, 2023 | 5:46 PM

కోతిని అత్యంత కొంటె జంతువుగా పరిగణిస్తారు. అందుకే వాటి అల్లరిని కోతి చేష్టలని అంటారు. ఇంకా కోతికి ఇల్లుండదు.. ఎదుటివారికి ఉండనివ్వదని కూడా అంటారు..వానర చేష్టలు ఎలా ఉంటాయో దాదాపు అందరికీ తెలిసిందే. మరో జంతువును వేధించడం, ఇంకొకరిని కొట్టడం, ఏదో ఒక విసుగు తెప్పించే పనినే పెట్టుకుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక వికృత చేష్టలు చేస్తుంటాయి. ఇక్కడ కూడా ఒక కోతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో కోతి చేస్తున్న ఇంటిపనులు చూస్తే నిజంగా అవ్వాల్సిందే..

వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే.. ఓ కోతి ఇంటి ఇల్లాలు చేసే పనులన్నీ చేస్తుంది. చేసిన తప్పుకు కోతి శిక్ష అనుభవిస్తుందట. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేయడానికి కోతికి గిన్నెలు కడగాలనే శిక్ష విధించాడు యజమాని. కోతి కూడా ఎలాంటి ఎదురు చెప్పలేదు.. నోరు మూసుకుని కాళ్లు చేతులు అదుపులో ఉంచుకుని యజమాని చెప్పిన అన్ని పనులు చకచకా చేసేస్తోంది.

ఇవి కూడా చదవండి

యజమాని వేసిన గిన్నెలన్నీ కడగడం మొదలుపెట్టింది. కోతి గిన్నెలు కడుతూ ఉంటే యజమాని ఇంకా తెచ్చి వేస్తున్నట్టుగా వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కోతి యొక్క ఈ వీడియో ____arun____520 Instagram ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో నెటిజన్లను అలరిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us