Viral Video: సీటు కోసం గొడవ.. మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు!

Viral Video: ఈ సంఘటన చూసిన మెట్రో జనం ఉలిక్కిపడ్డారు. కొంతమంది ప్రయాణికులు భయంతో వెనక్కి తగ్గగా, మరికొందరు జోక్యం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. మెట్రోలో ఇటువంటి వాగ్వాదాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఉద్రిక్త వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి. అలాగే..

Viral Video: సీటు కోసం గొడవ.. మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు!

Updated on: Oct 04, 2025 | 8:42 AM

Viral Video: సాధారణంగా బస్సుల్లో, రైళ్లలో సీట్ల గురించి గొడవ పడటం సర్వసాధారణం. ఈ మధ్య కాలంలో మెట్రోలలో కూడా సీట్ల గురించి తెగ గొడవ పడుతున్నారు. కొన్నిసార్లు ఈ వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. సీట్ల విషయంలో వాగ్వివాదానికి దిగిన ఇద్దరు ప్రయాణికుల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఇది కూడా చదవండి: FASTag: మీకు ఫాస్టాగ్‌ లేదా.. మీకో గుడ్‌న్యూస్‌.. కేంద్రం ఊరట..!

ఇవి కూడా చదవండి

ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఒక యువకుడు, ఒక మధ్య వయస్కుడి మధ్యం ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఆ యువకుడు చేయి పైకెత్తి దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆ మధ్య వయస్కుడు అతన్ని బలంగా తన్ని, కింద పడేశాడు. ఈ సంఘటన మెట్రో స్టేషన్‌లోని ఇతర ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే మరో వ్యక్తి మధ్య వయస్కుడిని చితకబాదాడు. గొడవ విన్న అనేక మంది ప్రయాణికులు జోక్యం చేసుకుని, ఇద్దరినీ విడదీసి శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఈ ఫైటింగ్‌ వీడియోను తీసిన ప్రయాణికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన చూసిన మెట్రో జనం ఉలిక్కిపడ్డారు. కొంతమంది ప్రయాణికులు భయంతో వెనక్కి తగ్గగా, మరికొందరు జోక్యం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. మెట్రోలో ఇటువంటి వాగ్వాదాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఉద్రిక్త వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి.

ఇది కూడా చదవండి: Viral Video: దొంగల ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌.. షాపులోకి రాగానే కనిపించకుండా పోయారు.. ఫాగింగ్ యంత్రంతో బెడిసికొట్టింది!

ఇది కూడా చదవండి: Cheque Clearing RBI: పాత విధానానికి గుడ్‌బై.. ఇక కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్‌.. నేటి నుంచి అమలు

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి