Viral Video : లాంగ్ జర్నీకి వెళ్లినప్పుడు మధ్యలో ఆకలేస్తే ఎక్కడైనా ఆగి హోటల్లో తింటాం. లేదంటే ఇంటి నుంచే ఏవైనా తినడానికి వెంట తీసుకెళ్తుంటాం.. లేదంటే, కారు, సొంతంగా మినీ బస్సుల్లో టూర్లకు వెళ్లేవారు.. చాలా వరకు వెంటే వంటసామాగ్రిని తీసుకువెళ్తుంటారు..అలా ఎక్కడైన సరైన ప్రదేశం చూసుకుని, లేదంటే, అద్దె గదుల్లో వంటచేసుకుంటుంటారు.. ఇదంతా మనందరికీ తెలిసిందే. కానీ, ఒక మహిళ మాత్రం ఏకంగా కారులోనే వంట చేసింది. పైగా తను చేస్తున్న వంటపనిని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దాంతో ఇప్పుడు ఇంటర్నెట్‌లో గందరగోళం సృస్టించింది. కంటెంట్ సృష్టికర్త అలిస్సా లారెన్ తన టెస్లాలో సీఫుడ్ రెడీ చేశారు. తను చేస్తున్న వంటకు సంబంధించిన ప్రతి పనిని క్లియర్ వీడియో తీసుకుంది… ఈ వీడియో నెటిజన్లలో పలు సందేహాలను లేవనెత్తింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇన్‌స్టాగ్రాం రీల్‌లో అలీసలౌరెన్ అనే వ్లాగర్ తన ఎలక్ట్రిక్ కారులో కూర్చుని తన ఒడిలో చాపింగ్ బోర్డ్ పెట్టుకుని దానిపై ఆలూను కట్ చేయడం కనిపిస్తుంది. ఆమె పక్కనే పోర్టబుల్ టూఇన్1 ఎలక్ట్రిక్ హాట్ పాట్, గ్రిల్ కనిపిస్తుంది. ఆలూ, కట్ చేసిన అల్లం ముక్కలను ఆమె బాయిల్ చేస్తుంది. గ్రిల్‌పై బటర్ వేసి దానిపై రొయ్యలను కుక్ చేస్తుంది. ఆపై రొయ్యలు, పొటాటోస్, సాసేజ్, ఇతర పదార్ధాలను మిక్స్ చేసి టేస్టీ రెసిపీని సిద్ధం చేసింది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇంకేముందుఇ.. ఈ ఇన్‌స్టా రీల్ ఇన్‌స్టంట్ సక్సెస్ అయింది.
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ కావటంతో ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగ 46 లక్షల మంది వీక్షించారు. కారులో వంటా వార్పు ఏంటని పలువురు యూజర్లు విస్మయం వ్యక్తం చేశారు. కారుపై ఆహారం మరకలు అంటితే ఎలా అని మరికొందరు ప్రశ్నించారు. అల్లం వెల్లుల్లి వాసనతో ఆ కారు ఏమైపోతుందంటూ మరికొందరు వాపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి