
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులలో లెక్కలేనన్ని జాతుల జంతువులు ఉన్నాయి. వాటిలో క్రూర మృగాలు ఉన్నాయి. సాధు జీవులున్నాయి. వీటిల్లో చాలా జీవుల గురించి మనకు తెలుసు. అలాగే చూడగానే చాలా వింత జీవిగా అనిపించే అనేక జాతులు కూడా ఉన్నాయి. అలాంటి ఒక వింతగా కనిపించే జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జీవికి పాము లాంటి నోరు, చాలా చిన్న తోక ముఖ్యంగా, ఈ జీవి నాలుక నీలం రంగులో ఉంది. వీడియో కనిపించిన జీవిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలు ఈ జీవి ఎలాంటిది అని ఆలోచిస్తూ.. దాని లక్షణాలను ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ వీడియోలో అడవిలో ఎండిన ఆకులపై కూర్చున్న ఒక వింత జీవిని మీరు చూడవచ్చు. దీని నోరు పాము నోరును పోలి ఉంది. అయితే దీని శరీర నిర్మాణం బల్లిని పోలి ఉంది. అప్పుడు కెమెరాను ఆ జీవికి దగ్గరగా తీసుకెళ్తుంటే.. అది అకస్మాత్తుగా తన నీలిరంగు నాలుకను బయటకు తీసింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ క్షణం చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీనిని పాములో ఒక రకం అని అంటున్నారు. మరికొందరు ఇది అరుదైన బల్లి జాతి కావచ్చునని అంటున్నారు.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @TheeDarkCircle అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు. ఈ 16 సెకన్ల వీడియోను ఇప్పటికే 40,000 వ్యూస్ సొంతం చేసుకోగా.. వందలాది మంది దీన్ని లైక్ చేసి వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనిని రాత్రి సమయంలో చూస్తే.. గుండెపోటు తప్పదని ఫన్నీగా కామెంట్ చేయగా.. మరొకరు ప్రకృతిలో చాలా అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి, వాటిని చూసిన తర్వాత కూడా నమ్మడం కష్టం’ అని అన్నారు.
నివేదికల ప్రకారం ఈ వింతగా కనిపించే జీవి బ్లూ-టాంగ్యుడ్ స్కింక్ అని పిలువబడే బల్లి. ఇది ఆస్ట్రేలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. దీని అత్యంత విలక్షణమైన లక్షణం దాని ప్రకాశవంతమైన నీలం నాలుక. ఇది ప్రమాదాన్ని గ్రహించినప్పుడు శత్రువులను భయపెట్టడానికి నాలికని ఉపయోగిస్తుంది. దూరం నుంచి చూస్తే పామును పోలి ఉంటుంది.. వాస్తవానికి ఇది ఒక రకమైన బల్లి. దీనికి చిన్న తోక, బరువైన శరీరం ఉంటుంది.
The legless Skink resemble snake due to their limbless bodies and unique blue tongue pic.twitter.com/DPuDY6KGdE
— Wildlife Uncensored (@TheeDarkCircle) September 17, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..