AP CM Jagan: సినీ సెలబ్రేటీలు, క్రీడాకారులు, రాజకీయనాయకులు ఎప్పుడు ఏమి చేస్తున్నారు, ఏ బట్టలు ధరిస్తున్నారు, ఎటువంటి ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు అని అందరూ ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా పొలిటిషియన్స్(Politicians) గురించి ఆలోచిస్తే.. ఎప్పుడు కుర్తా పైజమా, వైట్ అండ్ వైట్ కలర్ డ్రస్ మదిలోకి వస్తుంది. అయితే తాజాగాఆంధ్రప్రదేశ్(Andhrapradesh) సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(కి చెందిన ఓ పాత వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. న్యూజిలాండ్‌లో బంగీ జంపింగ్‌ను జగన్ ఆస్వాదిస్తున్న పాత వీడియో ఆన్‌లైన్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. ysjaganholic అనే ఛానెల్ ద్వారా Instagram లో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోలో జగన్ ఈ సాహసోపేతమైన క్రీడను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ సిఎం ఒక ప్లాట్‌ఫారమ్ మీద నిలబడి.. ఒక కొండమీద నుంచి దూకడానికి సిద్ధమవుతుండగా.. ఒక ట్రైనర్ జగన్ పక్కన నిలబడి ఉన్నారు. ప్లాట్‌ఫారమ్ నుండి దూకడానికి ముందు జగన్ రెడీ అవుతూ.. కెమెరా వైపు చూస్తూ.. చేయి ఊపుతున్నారు. కాళ్లకు త్రాడు సురక్షితంగా కట్టుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కిందకు జంప్ చేశాడు. సాహసాలను ఇష్టపడే జగన్ చెప్పుకోదగ్గ ఎత్తు నుంచి కిందకు దూకుతుంటే.. వీక్షకులకు గూస్‌బంప్‌లు వస్తున్నాయి. జగన్ జంప్ చేస్తున్న సమయంలో క్రిందప్రవహిస్తున్న నది.. చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అంతేకాదు ఒక పడవలో వాలంటీర్ల వీడియో షూట్ చేస్తున్నాడు. జంప్ చేయడానికి ముందు జగన్ సుందరమైన లోయలో త్రాడు నుండి ఊగుతూ కనిపించాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.4 లక్షల లైక్‌లను సంపాదించింది. సాహస క్రీడలు చేసే రాజకీయవేత్త చాలా అరుదు అంటూ జగన్ పై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. 2018లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లో విహారయాత్రకు వెళ్లినప్పుడు.. ఇలా బంగీ జంప్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడు ఈ వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. జగన్ బంగీ జంప్ చేసిన ప్రదేశం కవరౌ బంగి సెంటర్. న్యూజిలాండ్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశంగా ఖ్యాతిగాంచింది.
Also Read: