సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది పాత్రలకు తగ్గట్టుగా నటించి తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. మరికొంతమంది రీల్స్ పేరుతో ప్రమాదకర స్టంట్లు చేస్తుంటారు. అలాంటి ప్రాణాంతక స్టంట్స్‌లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కువైట్ తీరంలో ఓ డ్రైవర్ సాహసం చేస్తూ ప్రమాదం నుంచి అద్భుతంగా బయటపడ్డాడు. అబు అల్ హసానియా బీచ్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యం..కువైట్‌లోని అబు అల్ హసానియా బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో, అబూ అల్ హస్సానియా బీచ్ ఒడ్డున ఒక కారు వేగంగా వెళుతుండటం వీడియోలో కనిపించింది. బీచ్ లో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో.. డ్రైవర్ ఆ కారును బ్యాలెన్స్ చేయలేకపోయాడు. అప్పటికే కారు అటు ఇటుగా ఉగిసలాడుతోంది.. డ్రైవర్ కారును ఏ మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో ఒక్కసారిగా అదుపుతప్పిన కారు గాల్లోకి ఎగిరింది. పైగా ఆ కారు గాలిలో మూడు నాలుగు పల్టీలు కొట్టి.. సముద్రంలో పడిపోయింది. అందులో ఉన్న డ్రైవర్ కూడా కార్ తో పాటే గాల్లో నుంచి ఎగిరిపడి నీటిలో పడిపోయాడు. వీడియోను బట్టి చూస్తే ఇది ప్రమాదవ శాత్తు జరిగినట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ఆధారంగా కువైట్ పోలీసులు డ్రైవర్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వీడియో ఆధారంగా డ్రైవర్ వయసు 34 సంవత్సరాలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Shocking video shows the moment a 4WD loses control and rolls multiple times on Abu Al Hasaniya Beach in Kuwait, with the vehicle's 34-year-old driver miraculously walking away from the wreckage with minor injuries. pic.twitter.com/bvPNSpVNtv
— M O I B E N S H I R E (@Kapyoseiin) March 31, 2024
ఇక సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసిందని, ఇది నిజంగా షాకింగ్ ఉందని చాలా మంది స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో లైక్స్, కామెంట్స్ , షేర్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సామజిక మాధ్యమాలలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ డ్రైవర్ అదృష్టం బావుంది కాబట్టి బ్రతికి బయటపడ్డాడు అంటూ వాపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..