Viral Video: నీటి అడుగున కదులుతున్న భారీ ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు ఫ్యూజులౌట్.!

|

Jul 07, 2022 | 8:33 PM

సరస్సు లేదా సముద్రంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లినవారికి అప్పుడప్పుడూ ఊహించని పరిణామాలు ఎదురవుతుండటం...

Viral Video: నీటి అడుగున కదులుతున్న భారీ ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు ఫ్యూజులౌట్.!
Fish
Follow us on

సరస్సు లేదా సముద్రంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లినవారికి అప్పుడప్పుడూ ఊహించని పరిణామాలు ఎదురవుతుండటం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. గాలానికి బోలెడన్ని చేపలు చిక్కాల్సిందిపోయి.. పాములు పడటం.. లేదా.. మరేదైనా వస్తువులు చిక్కిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఇక్కడ సీన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది. దగ్గరలోని సరస్సులో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి.. స్టన్నింగ్ సీన్ ఎదురైంది. అది చూసిన అతడికి దెబ్బకు ఫ్యూజులు ఔట్..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సమ్మర్‌లో అప్పుడప్పుడూ స్థానికంగా ఉండే సరస్సుల్లో ఫిషింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దగ్గరలోని సరస్సుకు చేపల కోసం వెళ్లాడు. బోట్‌పై నది మధ్యకు వెళ్లి గాలానికి ఎర కట్టి నీటిలోకి వేశాడు. బోలెడన్ని చేపలు పడతాయనుకున్న అతడికి ఓ భారీ చేప వచ్చి షాక్ ఇచ్చింది. అతడి బోట్ పక్క నుంచి ఆ చేప ఈదుకుంటూ వెళ్లింది. దాని భారీ ఆకారాన్ని చూసి మొదట భయపడిన అతడు.. ఆ తర్వాత చేపను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

కాగా, దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘బ్యాక్‌యార్డ్ రివర్ మోనిస్టర్’ అని ఓ నెటిజన్ పేర్కొనగా.. ‘ఇంతకీ అది అసలు చేప.. లేక సొరచేప’ అని మరొకరు తన డౌట్ వ్యక్తం చేశాడు. ఇంకొందరైతే.. అది స్టుర్జియాన్(Sturgeon) జాతికి చెందిన చేప అని.. అవి 100 ఏళ్లు బ్రతికి ఉంటాయని రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.