Watch Video: రాంగ్‌ టైంలో కుక్కను ముద్దాడబోయాడు.. కట్‌చేస్తే బెడిసి కొట్టిన యవ్వారం! వీడియో చూస్తే నవ్వాగదు..

పెట్‌ క్లినిక్‌లో ఓ పెంపుడు కుక్క సోఫాలో కూర్చున్న ఇద్దరు వ్యక్తుల వద్దకు వచ్చింది. ఎంతో కూల్‌గా ఉన్న ఆ కుక్క వాళ్లతో ఆటాడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు ఫోజులు కొట్టింది. మొదటి వ్యక్తి ఫోన్‌తో బిజీగా ఉండటంతో అతడు పట్టించుకోలేదు. రెండో వ్యక్తి వద్దకు వెళ్లి ఒడిలో తలపెట్టి పడుకుంది. దీంతో అతడు కూడా ముచ్చటపడి దానితలను నిమరబోయాడు. అంతలో ఊహించని సీన్‌ జరిగింది..

Watch Video: రాంగ్‌ టైంలో కుక్కను ముద్దాడబోయాడు.. కట్‌చేస్తే బెడిసి కొట్టిన యవ్వారం! వీడియో చూస్తే నవ్వాగదు..
Pet Dog Attacks On Man

Updated on: Feb 15, 2025 | 6:12 PM

పెట్‌ క్లినిక్‌లో ఓ పెంపుడు కుక్క చేసిన పనికి అంతా హడలెత్తిపోయారు. ఆ క్లినిక్‌లోని సోఫాలో ఇద్దరు వ్యక్తులు కూర్చొన్నారు. చూసేందుకు చక్కగా.. ముద్దుగా ఉన్న పెట్ డాగ్‌.. కుర్చీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తుల వద్దకు వెళ్లింది. అయితే మొదటి వ్యక్తి డాక్టర్‌. ఆయన ఫోన్‌తో బిజీగా ఉండటంతో అతడు పట్టించుకోలేదు. రెండో వ్యక్తి వద్దకు వెళ్లి అతడి ఒడిలో తలపెట్టి పడుకుంది. అనంతరం అతడి చేతుల్లో దాని ముఖం పెట్టింది. దీంతో అతడు కూడా కుక్క చేష్టలను చూసి ముచ్చటపడ్డాడేమో. కుక్కను చేతుల్లోకి తీసుకోబోయాడు.. అంతే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. తొలుత కూల్‌గా ఉన్న ఆ కుక్క ఒక్కసారిగా రెచ్చిపోయింది. ఈ ఘటన ఫిబ్రవరి 11న ఓ పెట్‌ క్లినిక్‌లో చోటు చేసుకుంది.

సదరు వ్యక్తిపై దాడిచి యత్నించింది. ఈ హఠాత్‌ పరిణామంతో ఖంగుతిన్న అతడు ఆ కుక్క నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నానాయాతన పడ్డాడు. అతడి చేతిని నోటితో గట్టిగా పట్టుకుని అల్లడించింది. ఆ కుక్క నోటి నుంచి చేతిని విడిపించుకునేందుకు ఆ వ్యక్తి తీవ్ర ప్రయత్నం చేశాడు. పక్కనే కూర్చున్న వ్యక్తి డాక్టర్‌ అయినా.. కుక్క వైలెంట్‌ రియాక్షన్‌కు భయపడిపోయి అక్కడి నుంచి పరుగులంకించుకున్నాడు. దీంతో కుక్క దాడి చేసిన వ్యక్తి మాత్రం ఎలాగోలా దాని మెడ వద్ద ఉన్న బెల్ట్ పట్టుకుని దాన్ని బందించగలిగాడు. అది మళ్లీ దాడికి యత్నించడంతో పక్కనే ఉన్న గదిలో వేసి బందించాడు. ఇందుకు సంబంధించిన పెట్‌ క్లినిక్‌లోని సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తొలుత కూల్‌గా ఉన్న పెంపుడు కుక్క ఉన్నట్టుండి అలా ఎందుకు ప్రవర్తించిందోనన్నదానిపై ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. కుక్కను ఆ వ్యక్తి రెచ్చగొట్టి ఉంటాడని ఒకరు అనుమానించారు. జాలీగా ఉన్న ఆ కుక్క జోలికి అతడు వెళ్లకుండా ఉండాల్సిందని మరొకరు, పెంపుడు కుక్కలు అప్పుడప్పుడు ఇలా కొరుకుతాయన్నది అర్థం చేసుకునేదే అని ఒకరు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.