Viral: వామ్మో! గుండీల మాటున దాగున్న గూడుపుఠాణీ.. ఏంటో తెలిస్తే ఫ్యూజులౌట్!

|

Sep 01, 2022 | 8:59 PM

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తెల్లవారుజామున సౌదీ అరేబియా వెళ్లేందుకు విమానం రెడీగా ఉంది. పాసెంజర్స్ అందరూ కూడా చెకింగ్ ట్రాన్సిట్..

Viral: వామ్మో! గుండీల మాటున దాగున్న గూడుపుఠాణీ.. ఏంటో తెలిస్తే ఫ్యూజులౌట్!
Representative Image 1
Follow us on

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తెల్లవారుజామున సౌదీ అరేబియా వెళ్లేందుకు విమానం రెడీగా ఉంది. పాసెంజర్స్ అందరూ కూడా చెకింగ్ ట్రాన్సిట్ దగ్గరకు వస్తున్నారు. ఆ వచ్చేవారిలో ఓ వ్యక్తి ప్రవర్తన అక్కడున్న అధికారులకు కొంచెం అనుమానాస్పదంగా కనిపించింది. అంతే! అతడ్ని పక్కకు తీసుకొచ్చి.. లగేజ్ మొత్తాన్ని చెక్ చేశారు. అందులో లెహెంగా గుండీల మాటున దాగిన గూడుపుఠాణీని చూసి కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఆగష్టు 30వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-3 వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపడుతుండగా.. దుబాయ్ వెళ్తున్న ఇండియన్ పాసెంజర్‌పై వారికి అనుమానం కలిగింది. అతడి ప్రవర్తన.. పొంతనలేని సమాధానాలకు డౌట్ వచ్చి.. అధికారులు సదరు ప్రయాణీకుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 1,85,500 సౌదీ రియల్స్(రూ. 41 లక్షలు) బయటపడ్డాయి.

సదరు ప్రయాణీకుడు తన క్రియేటివిటీకి పదునుపెట్టి.. కస్టమ్స్ అధికారులకు పట్టుబడకుండా ఉండేలా.. డబ్బును దాచిపెడితే.. స్కాన్ మెషిన్‌లో అది కాస్తా బయటపడింది. అతడి బ్యాగ్‌లోని బట్టల మధ్య ఏదో దాచిపెట్టాడని అధికారులకు అర్ధమైంది. అతడి బ్యాగ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, మహిళల ‘లెహెంగా’లో ఉపయోగించే బటన్‌ల లోపల చతురస్రాకారంలో చక్కగా మడతపెట్టి ఉంచిన రూ. 41 లక్షల విలువైన 1,85,500 సౌదీ రియల్స్ క్యాష్‌ను అధికారులు గుర్తించారు. ఈ విదేశీ నగదుకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ సదరు వ్యక్తి చూపించకపోవడంతో.. అతడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..