Viral Video: ఇంతకు తెగించారేంట్రా..! బైక్‌పై ఒకరినొకరు లిప్‌కిస్.. మండిపడుతోన్న నెటిజన్లు..

|

Jun 01, 2023 | 12:35 PM

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన దగ్గర నుంచి జనాల్లో పిచ్చి బాగా ముదిరిపోయింది. లైకుల కోసం దిగజారిపోయి మరీ విచ్చలవిడి కంటెంట్‌ను..

Viral Video: ఇంతకు తెగించారేంట్రా..! బైక్‌పై ఒకరినొకరు లిప్‌కిస్.. మండిపడుతోన్న నెటిజన్లు..
Viral Video
Follow us on

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన దగ్గర నుంచి జనాల్లో పిచ్చి బాగా ముదిరిపోయింది. లైకుల కోసం దిగజారిపోయి మరీ విచ్చలవిడి కంటెంట్‌ను షేర్ చేసి నవ్వులపాలవుతున్నారు. మొత్తం అందరూ కూడా ఇలా ఉన్నారని చెప్పలేం. కొందరు సందేశాత్మక వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తే.. మరికొందరు పోస్ట్ చేసినవి నెటిజన్లకు ఆగ్రహం తెప్పించేలా ఉంటున్నాయి. సరిగ్గా ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ స్కూటీపై ముగ్గురు యువకులు వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. వాళ్లు ఏమైనా పందెం కాసుకున్నారో.. లేక వేరే విషయమో తెలియదు.. ఒక్కసారిగా వెనుక కూర్చున్న ఇద్దరు యువకులు ఘాటైన లిప్‌కిస్ ఇచ్చుకుంటారు. ఈ తతంగం మొత్తాన్ని వారితో ఫాలో అవుతున్న కారులోని వ్యక్తులు వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షా 50 వేల మందికి పైగా చూడగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేసున్నారు. ‘ఇదేం పైత్యం సామీ’ అంటూ కొందరు తలపట్టుకోగా.. మరికొందరు ‘హద్దులు మీరుతున్నారు’ అంటూ తిట్టిపోస్తున్నారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో.. ట్రాఫిక్‌లో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేసిన ఆ యువకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారిని ట్రేస్ ఔట్ చేసే పనిలో పడ్డారు.