Viral Video: రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్‌ చేసిన కారును ఒట్టి చేతులతో ఎత్తి ఎలా పక్కన పెట్టేశాడో చూడండి..

|

Apr 12, 2023 | 4:30 PM

సిటీల్లో డ్రైవింగ్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జరగరాని నష్టం జరిగిపోతుంది. ఐతే రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో పార్కింగ్‌ సమస్య పెద్ద సవాలైంది. దీంతో రోడ్డు పక్కన పార్క్‌ చేసి వెళ్తుంటారు. ఐతే కొందరు తమ వాహనాలకు పార్కింగ్‌ చేసేటప్పుడు..

Viral Video: రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్‌ చేసిన కారును ఒట్టి చేతులతో ఎత్తి ఎలా పక్కన పెట్టేశాడో చూడండి..
Viral Video
Follow us on

సిటీల్లో డ్రైవింగ్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జరగరాని నష్టం జరిగిపోతుంది. ఐతే రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో పార్కింగ్‌ సమస్య పెద్ద సవాలైంది. దీంతో రోడ్డు పక్కన పార్క్‌ చేసి వెళ్తుంటారు. ఐతే కొందరు తమ వాహనాలకు పార్కింగ్‌ చేసేటప్పుడు చేసే చిన్నపాటి తప్పుల వల్ల అటుగా వచ్చే వాహనాలకు ప్రమాదం జరుగుతుంటాయి. పార్కింగ్‌ సరిగ్గా చేయకపోయినప్పటికీ చాలా మంది చూసీచూడనట్టు వదిలేసి, తమ దారినతాము పోతుంటారు. ఐతే అదే దారిలో వచ్చే ఇతర ప్రయాణికులు ఏమరుపాటుగా ఉంటే క్షణాల్లో తీరని నష్టం వాటిల్లుతుంది. ఓ ప్రయాణికుడు మాత్రం తనకెందుకులే అనుకోలేదు. రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసిన వాహనాల్లో ఓ కారును రోడ్డుకు అడ్డంగా పార్క్‌ చేయడంతో ఎవరి సహాయం లేకుండానే ఒట్టి చేతులతో దాన్ని ఎత్తి పక్కన పెట్టేశాడు. నమ్మబుద్ధికావట్లేదా..? ఐతే ఈ వీడియోవైపు మీరూ ఓ లుక్కేసుకోండి..

ఓ వ్యక్తి ఎస్‌యూవీ కారు డ్రైవ్‌ చేసుకుంటూ ఇరుకైన రోడ్డుపై వెళ్తుంటాడు. ఆ రోడ్డు పక్కన అనేక వాహనాలు వరుసగా పార్కింగ్‌ చేసి ఉంటాయి. వాటిల్లో ఒక మారుతీ సుజుకి కారు మాత్రం రోడుకు అడ్డంగా ఉంటుంది. దీంతో తమ వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఎదురవ్వడంతో తనతోపాటు ప్రయాణిస్తున్న వ్యక్తి వెనక్కి వెళ్దామని సలహాయిస్తాడు. ఐతే డ్రైవింగ్‌ చేసే వ్యక్తి మాత్రం కారు డోరు తెరచుకని బయటికి వచ్చి, రెండు చేతులతో రోడ్డుకు అడ్డంగా ఉన్న మారుతి సుజుకి వ్యాగన్ కారును ఎత్తి పక్కకు జరపడం వీడియోలో చూడొచ్చు. దాదాపు 850 కిలోల బరువున్న కారును ఎవరి సహాయం లేకుండా తన రెండు చేతులతోనే పక్కకు జరపడం వీడియోలో కనిపిస్తుంది. లక్షల్లో వీక్షణలు, లైకులు రావడంతో ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మీ ఏరియాలో ఎవరైనా తమ వాహనాలను తప్పుగా పార్క్ చేస్తే ఆ వాహనాన్ని ఫోటో తీసి అధికారులకు పంపవచ్చు, లేదంటే ఆ వాహన డ్రైవర్‌ సమీపంలో ఉంటే పక్కకు తీయమని కోరవచ్చు. అంతేగానీ ప్రమదకరంగా మత్రం డ్రైవింగ్‌ చేయకూడదు సుమీ..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.