ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మొబైల్ వినియోగం, అవసరం విపరీతంగా పెరిగిపోయింది. తమకు ఉన్నంతలోనైనా సరే ఒక మొబైల్ ఫోన్ కొనాలని భావిస్తుంటారు. కొందరు కొత్త ఫోన్ కొనేందుకు డబ్బులు లేక, సరిపోక సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో తెలిసిన వారిని అడగడమో, మొబైల్ స్టోర్‌కి వెళ్లడమో, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విక్రయించే స్టోర్‌కు వెళ్లడమో చేస్తుంటారు.
తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడు కూడా తన ఫోన్ పోవడంతో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేయాలని భావించాడు. మొబైల్స్ తక్కువ ధరకే లభించే చోర్ బజార్‌లో ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంకేముందు నేరుగా చోర్ బజార్‌కు వెళ్లి తనకు నచ్చిన మొబైల్ ఫోన్ తీసుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఓ స్టోర్‌కి వెళ్లాడు. అక్కడ ఒక ఫోన్‌ను చూశాడతను. స్టోర్ నిర్వాహకుడిని మొబైల్ ధర అడిగాడు. బేరం చేస్తున్నాడు. షాపు అతను రూ. 20 వేలు అని చెప్పాడు.
దానికి స్పందించిన యువకుడు అంత ధరనా? అని ప్రశ్నించాడు. మొబైల్‌ను అటూ ఇటూ చూస్తూ ఈ మొబైల్ తాను పోగొట్టుకున్న మొబైల్ మాదిరిగానే ఉందిగా అని అంటాడు. వెంటన్ రియాక్ట్ అయిన షాపు అతను.. నీదెక్కడుంది భయ్యా, అది నాది అంటూ గట్టిగానే చెప్తాడు. దెబ్బకు అతనికి ఏం రిప్లై ఇవ్వాలో తెలియక బిక్కమొహం వేస్తాడు. మొత్తానికి చోర్ బజార్‌లో తాను పోగొట్టుకున్న ఫోన్‌ను కనిపెట్టినప్పటికీ.. ఏం చేయలేని పరిస్థితిలో వెనుదిరుగుతాడు ఆ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..