Viral Video: వీడు మనిషా.. మహానుభావుడా.! కుప్పలు తెప్పలుగా పాములు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

|

Aug 27, 2022 | 12:20 PM

పాము కనిపిస్తే చాలు.. అందరూ గజగజ వణికిపోతారు. అదే మన దగ్గరగా ఉన్నట్లయితే.. గుండె ఆగినంత పనవుతుంది.

Viral Video: వీడు మనిషా.. మహానుభావుడా.! కుప్పలు తెప్పలుగా పాములు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
Snake
Follow us on

పాము కనిపిస్తే చాలు.. అందరూ గజగజ వణికిపోతారు. అదే మన దగ్గరగా ఉన్నట్లయితే.. గుండె ఆగినంత పనవుతుంది. అలాగే ఇంటర్నెట్‌లో పాములకు సంబంధించిన వీడియోలు చాలానే చూసి ఉంటారు. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియోను చూస్తే మీరూ కచ్చితంగా షాకవుతారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ స్నేక్ క్యాచర్.. ఇప్పటివరకు తాను పట్టుకున్న అన్ని జాతుల పాములను అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నట్లుగా చూడవచ్చు. అతడు గోనె సంచిలో నుంచి కుప్పలు తెప్పలుగా పాములు తీయడమే కాకుండా.. ఒక్క ఉదుటున అనేక పాములను పట్టుకుని అడవిలో అతడు విడిచిపెడుతున్నాడు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి..

కాగా, ఈ వీడియోను ‘murliwalehausla24’ అనే స్నేక్ క్యాచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.