ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోటీ తయారు చేస్తూ ఓ వ్యక్తి ఉమ్మి వేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఢిల్లీ పక్కనే ఉన్న ఘజియాబాద్‌లోని ఖోడా ప్రాంతంలో ఈ కేసు నమోదవుతోంది. ఆ వీడియో ఢిల్లీ 6 అనే హోటల్‌కి సంబంధించినదని చెబుతున్నారు.
వైరల్ వీడియోలో ఓ యువకుడు రోటీ చేస్తూ అదే పిండిపై ఉమ్మివేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఎవరో అదంతా వీడియో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడంతో, ఘజియాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమ్ బజార్‌లో ఉన్న ఢిల్లీ 6 రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియోగా ఇందిరాపురం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సదరు వ్యక్తిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
गिरफ्तारी तक “वायरल” करते रहो..
नाम : इरफान अली-
काम : रोटी पर थूककर हिन्दुओं को खिलाना-स्थान : गाजियाबाद खोड़ा थाना (दिल्ली 6 चिकन पॉइंट होटल) का है मामला- pic.twitter.com/e4S4fa3HSe
— Sudhir Mishra 🇮🇳 (@Sudhir_mish) January 10, 2025
ఈ వీడియో చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌తోనే పరిష్కారం ఉంటుందా..? అని ఓ సోషల్ మీడియా యూజర్ ప్రశ్నిస్తున్నారు. నేరస్తులు చట్టానికి ఎందుకు భయపడరు? పదే పదే చట్టాన్ని ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? అలాంటి వారిపైనా, హోటల్ యజమానిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇలాంటి వ్యక్తులు పదే పదే ఇలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తుంటారని, ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి