AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆన్‌లైన్‌లో వచ్చిన లడ్డూల బాక్స్.. ఓపెన్ చేసి చూడగా దెబ్బకు కళ్లు తేలేసింది

ఈ ఏడాది వేసవి దేశమంతా మంటలు రేకెత్తించింది. దేశంలోని ఏ ప్రాంతం చూసినా.. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. ఇక ఉత్తర భారతదేశం అయితే.. నిప్పుల గోళం అనే చెప్పాలి. ఏకంగా 50 డిగ్రీలకు చేరుకున్నాయి.

Viral Video: ఆన్‌లైన్‌లో వచ్చిన లడ్డూల బాక్స్.. ఓపెన్ చేసి చూడగా దెబ్బకు కళ్లు తేలేసింది
Basan Laddu
Ravi Kiran
|

Updated on: Jun 24, 2024 | 5:53 PM

Share

ఈ ఏడాది వేసవి దేశమంతా మంటలు రేకెత్తించింది. దేశంలోని ఏ ప్రాంతం చూసినా.. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. ఇక ఉత్తర భారతదేశం అయితే.. నిప్పుల గోళం అనే చెప్పాలి. ఏకంగా 50 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇక ఇప్పుడు వర్షాలు మొదలైనా కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టలేదు. ఇక ఆ ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో అడ్డం పట్టేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు దెబ్బకు అవాక్ అవుతున్నారు.

సాధారణంగా ఎండ వేడికి ఏదైనా కూడా ఆవిరిలా మారిపోతుందని అంటుంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్న హీట్ వేవ్స్ ని చూపిస్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి కూడా. ఇక అప్పుడెప్పుడో ఎండలో పిండితో దోశ వేస్తే.. అది ఆ సూర్యుడి తాపానికి దోశగా మారిందని పలు కంటెంట్ క్రియేటర్లు చేసిన ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొట్టాయి. సరిగ్గా ఈ వీడియో కూడా అలాంటిదే. ఇక్కడ ప్యాక్ చేసిన లడ్డూలు.. ఏకంగా ఏమయ్యాయో చూస్తే..

వైరల్ వీడియో ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ హోమియోపతి డాక్టర్‌కు ఆన్ లైన్ ద్వారా ఓ స్వీట్ బాక్స్ ఇంటికొచ్చింది. ఆమె తల్లి ఎంతో ప్రేమగా లడ్డూలు చేసి.. వాటిని బాక్స్ లో పెట్టి సదరు డాక్టర్ కు పంపించింది. కట్ చేస్తే.. ఆ బాక్స్ డాక్టర్ ఇంటికి చేరుకోగానే.. ఓపెన్ చేసి చూడగా.. ఆ లడ్డూలన్నీ కరిగిపోయి.. హల్వాలా మారిపోయింది. ఇక ఆ బాక్స్ ఫొటో తీసిన సదరు హోమియోపతి డాక్టర్.. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. వెల్కమ్ టూ లడ్డూ.. ఇదిగో ఢిల్లీ హీట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

ఇది చదవండి: అలెర్ట్.! మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. ఇక జైలుకే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!