Watch Video: పెళ్లి ఊరేగింపులో గుర్రం అదిరిపోయే స్టెప్పులు.. అంతలో షాకింగ్ సీన్! వీడియో..

పెళ్లి ఊరేగింపుకు ఊరంతా తరలి వచ్చింది. రాత్రి పూట బ్యాండ్ మేళం సంగీతానికి అనుగుణంగా ఊరేగింపుకు ఏర్పాటు చేసిన గుర్రం డ్యాన్స్ చేయసాగింది. దాని స్టెప్పులకు ఊరంతా విస్మయంతో చూస్తూ ఉండిపోయారు. ఇంతలో మాంచి ఊపుమీదున్న గుర్రం ఒక్కసారిగా వెనక కాలు విదిలించి గాలిలోకి తన్నింది. అంతే దాని తన్నుడికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది..

Watch Video: పెళ్లి ఊరేగింపులో గుర్రం అదిరిపోయే స్టెప్పులు.. అంతలో షాకింగ్ సీన్! వీడియో..
Dancing Horse During Wedding Celebration

Updated on: Jan 30, 2025 | 10:01 AM

లక్నో, జనవరి 30: సందడిగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బంధుమిత్రులతో పెళ్లి వేదిక కోలాహలంగా ఉంది. కానీ అంతలోనే అనుకోని రీతిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో భాగంగా గుర్రం జోరుగా డ్యాన్స్‌ చేస్తూ ఉంది. అందరూ గుర్రం అదిరిపోయే స్టెప్పులేస్తుందని నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ మాంచి ఊపుగా స్టెప్పులేస్తున్న గుర్రం ఒక్కసారిగా వెనుక కాలు విదిలించింది. అంతే నిండుప్రాణం బలైంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జనవరి 27న రాత్రి వేళ హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఠాకూర్ చౌక్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. బ్యాండ్‌ మేళం మ్యూజిక్‌కు అనుగుణంగా ఊరేగింపుకు వచ్చిన గుర్రం డ్యాన్స్‌ చేసింది. ఇంతలో గుర్రం వెనుక ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వచ్చారు. గుర్రం అకస్మాత్తుగా వెనుక కాలుతో చిన్నారిని తన్నింది. దీంతో అక్కడున్న గట్టుకు ఆ బాలుడి తల బలంగా తగిలింది. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. దీంతో అప్పటి వరకూ హుషారుగా సాగిన పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. బాలుడి తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వారంతా ఈ హఠాత్‌ పరిణామానికి షాక్‌ అయ్యారు. ఈ ఘటన పక్కింట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియోలో గ్రామస్థులు పెళ్లి ఊరేగింపును, గుర్రం డ్యాన్స్‌ను చూస్తూ ఆనందిస్తుండటం కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు గుర్రం వెనుక ఆడుకుంటూ రావడం కూడా వీడియోలో చూడొచ్చు. క్షణాల వ్యవధిలో గుర్రం తన్నడంతో చిన్నారి కుప్పకూలడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్‌ వీడియోపై నెటిజన్లు భిన్నవిధంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వేడుకల్లో ప్రమాదాలు నివారించేందుకు పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారిని ఎల్లవేళలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.