Viral Video: వర్షంలో కొట్టుకుపోతున్న డెలివరీ బాయ్స్‌కు కొండంత సాయం చేసిన బస్సు డ్రైవర్లు.. ఇంతకీ ఏం చేశారంటే? వీడియో

|

Jul 09, 2024 | 12:04 PM

'మరో మనిషి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వాడే నిజమైన మనిషి!' అని ప్రముఖ కవయిత్రి మైథిలీ శరణ్ గుప్తా ఓ కవితలో అన్నారు. అవును.. మనిషిలో మానవత్వ పరిమళాలు వెదజల్లాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సి అవసరం లేదు. కష్ట సమయంలో కాస్తింత చేయూతనిస్తే అది మనిషిని మనీషిని చేస్తుంది. కష్టాల్లో ఉన్న వారిని రక్షించడం తక్షణ కర్తవ్యంగా భావించేవారి ముందు ఆ భగవంతుడు కూడా లొంగిపోవాల్సిందే..

Viral Video: వర్షంలో కొట్టుకుపోతున్న డెలివరీ బాయ్స్‌కు కొండంత సాయం చేసిన బస్సు డ్రైవర్లు.. ఇంతకీ ఏం చేశారంటే? వీడియో
Bus Drivers Help Delivery Boys During Rain
Follow us on

‘మరో మనిషి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వాడే నిజమైన మనిషి!’ అని ప్రముఖ కవయిత్రి మైథిలీ శరణ్ గుప్తా ఓ కవితలో అన్నారు. అవును.. మనిషిలో మానవత్వ పరిమళాలు వెదజల్లాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సి అవసరం లేదు. కష్ట సమయంలో కాస్తింత చేయూతనిస్తే అది మనిషిని మనీషిని చేస్తుంది. కష్టాల్లో ఉన్న వారిని రక్షించడం తక్షణ కర్తవ్యంగా భావించేవారి ముందు ఆ భగవంతుడు కూడా లొంగిపోవాల్సిందే. అలాంటి ఓ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

ఈ వీడియో క్లిప్‌లో ఇద్దరు బస్సు డ్రైవర్లు బస్సులను ఓ బ్రిడ్జిపై డ్రైవ్‌ చేస్తూ ఉంటారు. ఓ వైపు భారీ తుఫాను, మరోవైపు బలమైన ఈదురు గాలులు వీస్తుంటాయి. అయితే అదే బ్రిడ్జిపై వెళ్తున్న నలుగురు డెలివరీ బాయ్‌లు ఈదురు గాలులకు అదుపుతప్పి నడపలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది గమనించి బస్సు డ్రైవర్లు.. అడగకుండానే వరమిచ్చిన దేవుడిలా వారికి అండగా నిలిచి ప్రమాదం నుంచి కాపాడారు. నాలుగు బైకులు బ్రిడ్జి మధ్యలో నుంచి వెళ్తుంటే.. ఈ బస్సులు రెండూ చెరోవైపు అడ్డుగా ఉండి.. బలమైన గాలులు నుంచి డెలివరీ బాయ్స్‌ను కాపాడుతారు. వారు వెళ్లినంత దూరం అలా మెల్లగా వారికి గాలులు తగలకుండా రెండు బస్సులను అడ్డుగా పెట్టి, రక్షణ కవచంలా నడిపించారు. ఈ విధంగా వారందరూ కలిపికట్టుగా బ్రిడ్జ్‌ దాటడం వీడియోలో చూడొచ్చు. ఈ సంఘటన సమయంలో అదే బ్రిడ్జిపై కారులో ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌ అయ్యింది. నిజానికి, ఈ సంఘటన నవంబర్ 2021లో జరిగింది. పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు 1.4M వీక్షణలు, 183k లైక్‌లు, కామెంట్లు రావడంతో వైరల్‌ అయ్యింది. పలువురు నెటిజన్లు సదరు బస్సు డ్రైవర్ల మానవతా ధృక్పధాన్ని తెగ పొగిడేస్తున్నారు. మీకూ ఆపదలో ఉన్న వారు ఎవరైనా కనిపిస్తే.. వారు సాయం అడిగేంత వరకు ఎదురు చూడకుండా వారికి సాయం చేసే ప్రయత్నం చేయండి. వారి దృష్టిలో మీరు చేసిన మేలు ఆ జన్మాంతం గుర్తుండిపోతుంది.

మరిన్ని ట్రెండింగ్‌ ఆర్టికల్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.