Watch: గున్న ఏనుగుల చిలిపి చేష్టలు.. చంటి పిల్లల్లా సాకుతున్న ఫారెస్ట్ అధికారులు.. వీడియో చూస్తే..!

ఏనుగుల ఆడుకోవడాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. ఏనుగుల అందమైన వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. తాజాగా, ఏనుగు పిల్లల ఆహారం తిని, అటవీ సిబ్బందితో ఎటువంటి భయం లేకుండా సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఏనుగు ముద్దుగుమ్మలను చూసి యూజర్లు ముగ్ధులయ్యారు. చిలిపి చేష్టలు తెగ ఆకట్టుకున్నాయి.

Watch: గున్న ఏనుగుల చిలిపి చేష్టలు.. చంటి పిల్లల్లా సాకుతున్న ఫారెస్ట్ అధికారులు.. వీడియో చూస్తే..!
Elephants Viral Video

Updated on: Aug 08, 2025 | 11:01 AM

ఏనుగు పిల్ల చేష్టలను చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. వాటి ఆటలు, చేష్టలు చూస్తుంటే వాటిని కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఏనుగులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆ ఏనుగులు చిన్న పిల్లల్లా ఆడుకుంటాయి, సహచరులతోనే కాకుండా మనుషులతో కూడా ఆప్యాయంగా ప్రవర్తిస్తాయి. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్, తల్లిని కోల్పోయిన రెండు పిల్ల ఏనుగులను చేరిదీసి ఆశ్రయం ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకదానికొకటి తోసుకుంటూ, కలిసి ఆహారం తింటున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమ ప్రశంసలను వ్యక్తం చేశారు.

ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను @ParveenKaswan అనే X ఖాతాలో షేర్ చేస్తూ, “గజరాజ్.. తీస్తా అనే రెండు ఏనుగు పిల్లలను కలిశాను. వాటి తల్లులు మరణించిన తర్వాత అవి అనాథలుగా మారాయి. తల్లిని కోల్పోయిన ఈ పిల్లలను రక్షించారు. ఇప్పుడు అవి తమ సంరక్షణలో సంతోషంగా ఉన్నాయి.” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఈ వీడియోలో, మీరు రెండు ఏనుగు పిల్లలు ఒకదానికొకటి సున్నితంగా తోసుకోవడం, కలిసి తినడం, అటవీ సిబ్బందితో సరదా ఆటలు ఆడుతుండటం చూడవచ్చు. ఆగస్టు 6న షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు నలభై వేలకు పైగా వీవ్స్ వచ్చాయి. ఈ ఏనుగుల వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అటవీ అధికారులను అభినందిస్తున్నారు. ఒక వినియోగదారుడు, “ఇది నిజంగా హృదయాన్ని కదిలించేది, గజరాజ్.. తీస్తా అటవీ అధికారుల చేతుల్లో పెరుగుతున్న తీరు చూస్తుంటే సంతోషంగా ఉంది” అని అన్నారు. మరొకరు, “ఇలాంటి వీడియోలను చూడటం చాలా ఆనందంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..