మీలో చాలా మంది సైకిల్ తొక్కే ఉంటారు. అయితే ‘డబుల్ డెక్కర్’ సైకిల్ తొక్కే అదృష్టం ఎప్పుడైనా కలిగిందా? అవును, డబుల్ డెక్కర్ సైకిలే.. ఇదేంటీ డబుల్ డెక్కర్ బస్సు విన్నాం, చూశాం కానీ, డబ్బుల్ డెక్కర్ సైకిల్ ఏంటీ కొత్తగా, వింతగా ఉంది అనుకుంటున్నారు కాదా..? కానీ, డబుల్ డెక్కర్ సైకిల్ కూడా ఉంది. డబుల్ డెక్కర్ అంటే, చక్రం పైన మరొక చక్రం, దానిని నడిపించాలంటే ఆ వ్యక్తి చాలా ఎత్తులో కూర్చోవాల్సి ఉంటుంది. వార్నీ, అదేలా ఉంటుందబ్బా..! అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు కదా..అయితే, ఇక్కడ వైరల్‌గా మారిన వీడియో చూస్తే మాత్రం మీరు కచ్చితంగా నోరెళ్ల బెట్టాల్సిందే. ఈ వైరల్ వీడియోని చాలా మంది వీక్షిస్తున్నారు. దీనిని ఒక అధికారి ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. అందులో ఒక వృద్ధ జుగాడ్ చేసిన ‘డబుల్ డెక్కర్’ సైకిల్‌తో రోడ్డుపై వెళ్తుండటం కనిపిస్తుంది.
అయితే ఈ వీడియో చూసిన జనాలు చాలా రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, ఈ సైకిల్ జుగాడ్ నుండి తయారు చేయబడింది. దీని కోసం పైన ఉన్న అట్లాస్ సైకిల్ ఫ్రేమ్‌ను తొలగించి సాధారణ సైకిల్‌ను అమర్చారు. హ్యాండిల్‌కు బదులుగా, కారు స్టీరింగ్ వీల్ అమర్చారు. ఈ వీడియోను కలెక్టర్ ‘సంజయ్ కుమార్’ (@dc_sanjay_jas) మే 30న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అతను ఈ వీడియో శీర్షిక కోసం ప్రజలను కోరాడు.. దానికి ప్రతిస్పందనగా వినియోగదారులు ఫన్నీ వ్యాఖ్యలు చేశారు.
कैप्शन..?
☺️ pic.twitter.com/GwZyW4Crkf— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) May 30, 2023
వీడియో చూసిన ఒక ఒక వ్యక్తి ఆ తాతయ్య దానిపై ఎలా ఎక్కాడు అని రాశాడు. మరొకరు మామయ్యకు బ్రేకులు వేయాలంటే ఏమి చేయాలి..? అంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా, ఈ సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటని మరో వినియోగదారు అడిగారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో లక్షల సంఖ్యలో వ్యూస్, లైకులు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..