ఓ యువకుడు 150 అడుగులకు పైగా ఎత్తైన విద్యుత్ స్తంభాన్ని ఎక్కడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. హైటెన్షన్ వైర్ల ద్వారా హై పవర్ వెళుతుండగా, ఎవరో యువకుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని కిందకు దిగాలని కోరుతూ స్తంభం చుట్టూ భారీగా జనం గుమిగూడారు. అతన్ని వెంటనే కిందకు దిగాలంటూ అందరూ అరుపులు కేకలు పెట్టారు. అంతలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. పోలీసుల్ని చూసిన ఆ యువకుడు కిందకు దిగకుండా అక్కడే వింతగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కేసు నోయిడా సెక్టార్ 76కి చెందినదిగా తెలిసింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఓ యువకుడు హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కుతుండగా స్థానికకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకునేలోపే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మెట్రో లైన్ కింద ప్రజలు ఆగి యువకుడి వీడియోలు తీయడం ప్రారంభించారు. వీటన్నింటితో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
ఇక్కడ క్లిక్ చేయండి..
नोएडा के सेक्टर-78 स्थित बरौला के सामने रविवार दोपहर युवक हाई वोल्टेज बिजली लाइन की पोल पर चढ़ा, Video Viral. @noidapolice @DCP_Noida #Noida #NoidaPolice #ViralVideo pic.twitter.com/fPASXy3n0z
— Tricity Today (@tricitytoday) November 10, 2024
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీం తొలుత అక్కడ గుమిగూడిన వారందరినీ అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఎలాగోలా ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కిందకు దించారు. ఇదంతా దాదాపు 2 గంటల సమయం పట్టింది. అప్పటి వరకు ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నడిచింది. ఎట్టకేలకు యువకుడు కిందకు దిగిరావడంరతో అన్ని రెస్క్యూ ఏజెన్సీలు ఊపిరి పీల్చుకున్నాయి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..