Trending Video: సోషల్ మీడియా(Social Media)లో డైలీ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించినవే ఉంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా.. అటవీ ప్రపంచంలో ఇతర జీవులను వేటాడావే ఎక్కువ ఉంటాయి. కేవలం ఆకులు, కాయలు, పండ్లు తిని బతికే జీవులు చాలా తక్కువ ఉంటాయి. పక్షులు అయితే ఎక్కువగా చిన్న, చిన్న పురుగులు.. క్రిమికీటకాలను తింటాయి. కొన్ని రకాల పక్షులు చేపల్ని కూడా వేటాడతాయి. అయితే ఓ మాదిరి సైజ్ ఉండే జీవుల్ని సైతం అమాంతం మింగే పక్షి ఒకటి ఉంది. అదే హెరాన్. ఇది కొంగను పోలి ఉంటుంది. రకరకాల రంగుల్లో ఉంటుంది. కానీ దీని వేట మాత్రం సాలిడ్‌గా ఉంటుంది. ఇది చేపల్ని చాలా ఈజీగా ట్రాప్ చేసి తినేస్తుంది. చేపల్ని మాత్రమే కాదు… ఎలుకలు, కుందేళ్లు, పాములు, పక్షులు.. ఇలా అదీ.. ఇదీ కాదు.. ఏ జీవి దొరికితే దాన్ని అమాంతం మింగేస్తుంది. అయితే హెరాన్‌కు ఒక అలవాటు ఉంది.. ఏదైనా జీవిని మింగేముందు ఒకటికి రెండుసార్లు దాన్ని శుద్ది చేస్తుంది. తాజాగా ఈ పక్షి ఓ బ్రతికున్న కుందేలును మింగేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇంకాస్త పెద్ద సైజు ఉంటే ఇది మనుషుల్ని కూడా మింగేస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
Also Read: Telangana: ఏరుకోండి.. ఏరుకోండి.. ఈ సీన్ చూస్తే మీరు కచ్చితంగా స్టన్ అవుతారు