Viral Video: దీని టాలెంట్ మామూలుగా లేదుగా.. ఈ కుందేలు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

కుందేళ్ళు నేల మీద నివసించే జంతువులు. ఎడారులలో నైనా, ఉష్ణమండల అరణ్యాలలోనైనా, చిత్తడి నేలలోనైనా జీవిస్తాయి. కుందేళ్ళు పూర్తిగా శాకాహారులు. ఎక్కువగా గడ్డిని, కాయగింజలనూ..

Viral Video: దీని టాలెంట్ మామూలుగా లేదుగా.. ఈ కుందేలు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
Rabbit

Updated on: Sep 17, 2022 | 2:16 PM

Viral Video: కుందేళ్ళు నేల మీద నివసించే జంతువులు. ఎడారులలో నైనా, ఉష్ణమండల అరణ్యాలలోనైనా, చిత్తడి నేలలోనైనా జీవిస్తాయి. కుందేళ్ళు పూర్తిగా శాకాహారులు. ఎక్కువగా గడ్డిని, కాయగింజలనూ ఆహారంగా తీసుకుంటాయి. ఇప్పడీ కుందేలు ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా… ఓ కుందేలుకు సంబంధించిన చక్కని వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. అటవీ ప్రాంతంలో అదురుతూ బెదురుతూ ఎంతో చలాకీగా తిరిగే కుందేలు కొలనులో దిగి ఈత కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లకు ఈత నేర్పిస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక కుందేలు ఓ కొలను దగ్గరకి వచ్చింది. కాసేపు అటూ ఇటూ గమనించింది. సరదాగా ఈతకొట్టాలనిపించినట్లుంది. మెల్లగా ఆ కొలనులోకి దిగింది. ఈ గట్టునుంచి ఆ గట్టుకి ఈత కొట్టుకుంటూ ఓ రౌండేసి చకచకా వచ్చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కుందేలు ఈతకొట్టడం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. పరుగు పందెలోనే కాదు.. స్విమ్మింగ్‌లోనూ విన్నరే.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అసలు దీని టాలెంట్ మామూలుగా లేదుగా అంటూ ప్రశంసలు కురిస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us