Viral Video: వంట గది నుంచి చప్పుళ్లు.. పిల్లి వచ్చిందేమో అని వెళ్లి చూడగా..

|

Aug 30, 2024 | 9:20 AM

ఇప్పుడు వర్షాకాలం నడుస్తోంది. పాములు ఇళ్లల్లోకి వచ్చే చాన్స్ ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవారు.. పొలాలకు సమీపంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. అవి ఎప్పుడు వచ్చి ఎక్కడ నక్కి ఉంటాయో మనం అంచనా వేయలేం. తాజాగా....

Viral Video: వంట గది నుంచి చప్పుళ్లు.. పిల్లి వచ్చిందేమో అని వెళ్లి చూడగా..
Cobra In Kitchen
Follow us on

ప్రజంట్ రెయినీ సీజన్ నడుస్తోంది. పాములు ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. బూట్లలోనూ.. ఇంటి గదుల మూలల్లోనూ.. దుస్తుల్లో, బీరువాల కింద, బైకుల్లో ఇలా రకరకాల మరుగు ప్రాంతాల్లో అవి నక్కే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదం సంభవించవచ్చు. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌ నగరం సర్కార్‌నగర్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంట్లోని వంటి గది నుంచి.. గిన్నెల శబ్ధం రావడంతో.. పిల్లి వచ్చిందేమో అని చూసేందుకు వెళ్లింది. కానీ అక్కడ కనిపించిన జీవిని చూసి భయంతో అరుస్తూ పరుగులు తీసింది. ఆమె లోపలికి వెళ్లగానే పెద్ద నాగుపాము పడగవిప్పి కనిపించడంతో.. ఆమె భయబ్రాంతులకు గురైంది. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అతను వచ్చి.. వంటగదిలో నక్కిన పాము చాకచక్యంగా బంధించాడు.

వీడియో దిగువన చూడండి…

స్నేక్ క్యాచర్ పామును బంధిస్తున్న సమయంలో అది పడగవిప్పి ఎంత దూకుడుగా అతనివైపు దూసుకువచ్చే ప్రయత్నం చేస్తుందో మీరు వీడియోలో చూడవచ్చు. ఫైనల్‌గా ఒక పైపు సాయంతో ఆ ప్రమాదకర నాగుపామును అతని సంచిలో బంధించాడు. ఆపై దాన్ని సురక్షితంగా ఓ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. చేతులతో అలవోకగా పామును బంధించిన స్నేక్ క్యాచర్‌ ధైర్యసాహసాలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.

కాగా పాములు జనావాసాల్లోకి వస్తే.. వాటిని కొట్టి చంపకుండా.. తమకు లేదా వైల్డ్ లైఫ్ యాక్టివిస్టులకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..