రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖరీదైన కారులో ఉన్నట్టుండి దట్టమైన పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో..కారులో ఉన్నవారు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు కూడా భద్రత కోసం పరుగులు తీశారు. కాలిపోతున్న ఆకుపచ్చ రంగు బిఎమ్‌డబ్ల్యూ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని రద్దీగా ఉండే ఓ రహదారిలో గ్రీన్ కలర్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు దూకాల్సి వచ్చింది. పొగతో కాలిపోతున్న కారు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.
సమాచారం ప్రకారం..కారు డ్రైవర్ 22 ఏళ్ల పార్థసారథిగా గుర్తించారు. సమయానికి కారులోంచి దూకి గాయపడకుండా తప్పించుకున్నాడు. తమిళనాడు రాజధానిలోని క్రోంపేటలో పార్థసారధి తిరువల్లికేణి నుంచి తిండివనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు నివేదిక పేర్కొంది. కారులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దాదాపు 30 నిమిషాల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును క్లియర్ చేశారు.
This is scary. #BMW car caught fire at Chrompet, Chennai. #ChennaiRains pic.twitter.com/Ob1MgKH5ZA
— The Dreamer (@Asif_admire) July 25, 2023
చెన్నైలో రద్దీగా ఉండే రోడ్డుపై గ్రీన్ కలర్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది. మార్గమధ్యలో కారు తగలబడిపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో పొగ వ్యాపించటంతో చూసిన డ్రైవర్ 3 సిరీస్ జీటీ కారును ఆపి వాహనంలో నుంచి దూకేశాడు. తొలుత చిన్నగా కనిపించిన మంటలు కారు మొత్తం వ్యాపించాయి. దీంతో కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది.
అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షలు నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేశారు. అయితే, ఈ లగ్జరీ కారు అరుణ్ బాలాజీ అనే వ్యక్తికి చెందినదిగా తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..