పెంపుడు జంతువులకు స్నానం చేయిస్తూ.. వాటి బాగోగులు చూడటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కాని.. పాములంటే మాత్రం ప్రతి ఒక్కరూ భయపడిపోతాం. అసలే విష జంతువు కావడంతో కాటేస్తే ప్రమాదం అనే ఉద్దేశంతో పాములతో చాలా జాగ్రత్తగా ఉంటాం.. అయితే కొంతమంది పాములంటే కూడా భయపడరు. పాములను చేతి పట్టుకోవడం, మెడలో వేసుకోవడం వంటి స్టంట్‌లు చూసే ఉంటాం. ఎందుకంటే సోషల్ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వాస్తవానికి ఇది స్టంట్ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది.
కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్ స్టంట్ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇన్‌స్ట్రాగామ్ వినియోగదారుడు ఎందుకు మహిళలు పురుషులకంటే ఎక్కవ కాలం జీవిస్తారో తెలుసా అంటూ చల్లటి నీళ్లతో కోబ్రాకి బాత్ అనే క్యాప్షన్ జోడించి ఈ వీడియో పోస్ట్ చేశాడు.
పోస్టు చేసిన అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించగా.. వేల మంది లైక్ లు కొట్టారు. పెంపుడు జంతువులకుమ స్నానం చేయించినంత ఈజీగా కోబ్రాకు స్నానం చేయించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..