పీకిన పన్ను ఫోటో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన లక్ష్మణ్.. సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

| Edited By:

Apr 30, 2019 | 9:02 PM

టీం ఇండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్‌పై సోషల్‌మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. పంటి నొప్పితో బాధపడుతున్న ఆయన ఇటీవల ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. డాక్టర్‌తో కలిసి దిగిన ఫోటోతో పాటు.. పీకిన పన్ను ఫోటోని కూడా పోస్ట్ చేశారు. కొన్ని బాధలు శారీరకంగా, కొన్ని బాధలు మానసికంగా ఇబ్బంది పెడతాయి. రెండు విధాలుగా బాధపెట్టేది పంటినొప్పి […]

పీకిన పన్ను ఫోటో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన లక్ష్మణ్.. సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
Follow us on

టీం ఇండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్‌పై సోషల్‌మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. పంటి నొప్పితో బాధపడుతున్న ఆయన ఇటీవల ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. డాక్టర్‌తో కలిసి దిగిన ఫోటోతో పాటు.. పీకిన పన్ను ఫోటోని కూడా పోస్ట్ చేశారు.

కొన్ని బాధలు శారీరకంగా, కొన్ని బాధలు మానసికంగా ఇబ్బంది పెడతాయి. రెండు విధాలుగా బాధపెట్టేది పంటినొప్పి మాత్రమే అంటూ కామెంట్ కూడా పెట్టారు. జ్ఞానదంతం రావడంతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నానని.. ఆ పంటిని నా చిన్ననాటి మిత్రుడు, మంచి దంతవైద్యుడు.. స్కూల్, కాలేజీలో కెప్టెన్ అయిన పార్త్‌ సత్వలేఖర్ తొలగించారని వెల్లడించారు. అయితే లక్ష్మణ్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు.. వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ ఫోటోలపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.